Best Affordable Bikes with High Mileage: మీరు రోజువారీ ప్రయాణానికి సరైన బైక్ కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం మీ కోసమే. హైదరాబాద్‌లో లేదా ఇతర నగరాల్లో రోజూ ఇంటి నుంచి ఆఫీస్‌కి కానీ, లేకపోతే రోజువారీ ప్రయాణాలు చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగపడే కొన్ని ఉత్తమ ఆప్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ (Bajaj Freedom 125 CNG)
ఈ లిస్ట్‌లో మొదటిది బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 సీసీ. ఇది ప్రపంచంలోనే మొదటి సీఎన్‌జీ బైక్ కావడం విశేషం. ఈ బైక్ ధర రూ. 95 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఈ బైక్ మెయింటెయిన్స్‌కు కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. బైక్ మైలేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది.


బజాజ్ తీసుకొచ్చిన ఈ సీఎన్‌జీ బైక్ పెట్రోల్, సీఎన్‌జీ రెండింటి సాయంతోనూ పని చేస్తుంది. దీని ఇంజన్ 9.5 పీఎస్ పవర్,  9.7 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ సీఎన్‌జీపై కిలోగ్రాముకు 102 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది పెట్రోల్‌పై లీటర్‌కు 64 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.


Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
ఈ లిస్ట్‌లో రెండో బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఢిల్లీలో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.82,911. ప్రాంతాన్ని బట్టి ఈ ధర కొంచెం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. సాధారణ మోడల్ లాగానే ఈ బైక్‌లో ఎయిర్ కూల్డ్ 97.2 సీసీ స్లోపర్ ఇంజన్ ఉంది. ఇది 8000 ఆర్పీఎం వద్ద 8.02 హెచ్‌పీ పవర్‌ని, 6000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇది 100 సీసీ కమ్యూటర్ బైక్‌లకు ప్రామాణికం. ఈ ఇంజన్ లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హీరో i3s స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఇందులో అందించారు.


హోండా ఎస్పీ 125 (Honda SP 125)
ఈ లిస్ట్‌లో మూడో బైక్ హోండా ఎస్పీ 125. భారతదేశంలో హోండా ఎస్పీ 125 ధర రూ. 86,474 నుంచి ప్రారంభం అవుతుంది. వేరియంట్‌ను బట్టి ఇది రూ. 90,467 వరకు ఉంటుంది. ఈ హోండా బైక్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో హోండా ఎస్పీ 125 డ్రమ్, హోండా ఎస్పీ 125 డిస్క్ ఉన్నాయి. ఈ బైక్ 123.94 సీసీ సింగిల్ సిలిండర్ బీఎస్6 6, ఓబీడీ2 కంప్లైంట్ పీజీఎం-ఎఫ్ఐ ఇంజన్‌తో వస్తుంది. ఇది 8 కేడబ్ల్యూ పవర్, 10.9 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే