సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం 'వేట్టయన్ - ద హంటర్'. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ (TJ Gnanavel) దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకం మీద సుభాస్కరన్ నిర్మించారు. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదలైంది. రీసెంట్‌గా రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ కొంత ఆందోళనలో ఉన్నారు. వాళ్లను సంతోషపెట్టేలా ట్రైలర్ వచ్చింది. అది ఎలా ఉందో చూడండి.
రజనీకాంత్ హీరోయిజం కేక... గూస్ బంప్స్ గ్యారంటీ!
Rajinikanth Role In Vettaiyan Movie: 'వేట్టయన్'లో రజనీకాంత్ పోలీస్ రోల్ చేశారు. రౌడీలు, గూండాలు, నేరస్తుల పాలిట యముడిగా మారిన ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా ఆయన కనిపించనున్నట్లు ఆల్రెడీ విడుదల చేసిన ప్రివ్యూలో చూపించారు. అంతకు మించి అన్నట్టు ట్రైలర్ కట్ చేశారు. మహిళల మీద అత్యాచారాలు, అటువంటి మృగాళ్లను ఎన్కౌంటర్ చేసే సిస్టమ్ మీద సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. విలన్లకు రజనీకాంత్ ఇచ్చే పంచ్, ఆ పంచ్ పవర్ కు ఒక్కొక్కరు కింద పడటం, ట్రైలర్ ఎండింగ్ అంతా సూపర్బ్ అనేలా ఉంది.
హీరోయిజం చూపించడంలో రజనీకి ప్రత్యేకమైన శైలి ఉంది. ఆయన స్టైల్, ఆ మాస్ మేనరిజమ్స్ కోసం సినిమాలు చూసే ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళను ఫుల్ శాటిస్‌ఫై చేసేలా 'వేట్టయన్' రూపొందించినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. రజని హీరోయిజం చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటికి మంచి ఇంపార్టెన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఒక్కసారి ఆ ట్రైలర్ మీరూ చూడండి.
విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న విడుదల
తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 10న 'వేట్టయన్ - ద హంటర్' సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. 'మనకు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు' అని రౌడీ చెప్పే డైలాగ్ ప్రివ్యూలో హైలైట్ అయ్యింది. అటువంటి డైలాగులు ఇంకా ఉన్నాయి.
'2.0', 'దర్బార్', 'లాల్ సలామ్' సినిమాల తర్వాత రజనీకాంత్, లైకా పొడక్షన్స్ సంస్థ కలయికలో... 'పేట', 'దర్బార్', 'జైలర్' అనిరుద్ రవిచందర్, రజనీకాంత్ కలయికలో... వస్తున్న చిత్రమిది.
Also Read: సర్జరీ జరిగిన 50 రోజులకు... మాస్ మహారాజా రవితేజ మళ్లీ షూటింగ్ చేసేది ఎప్పుడంటే?
Vettaiyan - The Hunter Movie Cast And Crew: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన 'వెట్టయన్ - ద హంటర్' సినిమాలో అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ఫిలోమిన్ రాజ్, ప్రొడక్షన్ డిజైన్: కె. కదిర్, యాక్షన్: అన్బు - అరివు, ఛాయాగ్రహణం: ఎస్.ఆర్. కదిర్, సంగీతం: అనిరుద్ రవిచందర్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, నిర్మాత: సుభాస్కరన్, దర్శకత్వం: టీజే జ్ఞానవేల్.