Best Bikes Under 1 lakh: దీపావళిని వెలుగుల పండుగ అని పిలుస్తారు. ప్రజలు తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడానికి పండగ సందర్భంగా తమ ఇళ్లకు కొత్త వస్తువులను కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. ఈ పండుగ ధన్‌తేరస్ నుండే ప్రారంభం అవుతుంది. ప్రజలు ధన్‌తేరస్‌లో కొత్త కారు లేదా బైక్‌ను కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటారు. భారతీయ మార్కెట్‌లో సామాన్యుల బడ్జెట్‌లో ఎన్నో గొప్ప బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ మోటార్‌సైకిళ్ల జాబితాలో బజాజ్, టీవీఎస్, హీరో, హోండా బైక్‌లు కూడా ఉన్నాయి.


హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus)
హీరో స్ప్లెండర్ ప్లస్ ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో ఒకటి. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఓహెచ్‌సీ ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 8,000 ఆర్పీఎం వద్ద 5.9 కేడబ్ల్యూ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9.8 లీటర్లుగా ఉంది. హీరో స్ప్లెండర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.75,441 నుంచి ప్రారంభం అవుతుంది.


బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)
బజాజ్ ప్లాటినా 100లో 115 సీసీ డీటీఎస్-ఐ ఇంజన్ అమర్చారు. ఈ బైక్ ఇంజన్‌కి 5 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా పెయిర్ చేసి ఉంచారు. బైక్‌కు స్టైలిష్ లుక్ ఇవ్వడానికి ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను ఉపయోగించారు. బైక్‌లో అమర్చిన కొత్త టైల్‌లైట్ ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. బజాజ్ ప్లాటినా 100లో డ్రమ్ బ్రేక్‌లు అమర్చబడ్డాయి. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.71,354 నుంచి ప్రారంభం అవుతుంది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


టీవీఎస్ రెయిడర్ (TVS Raider)
దీపావళి సందర్భంగా టీవీఎస్ రెయిడర్‌పై గొప్ప ఆఫర్ ఉంది. దీని కారణంగా మీరు ఈ బైక్ కొనుగోలుపై రూ. 13,000 వరకు ఆదా చేసుకోవచ్చు. దీపావళి సందర్భంగా ఈ టీవీఎస్ ​​బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,869 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ ఐదు వేరియంట్లలో ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది.


హోండా షైన్ (Honda Shine)
హోండా బైక్‌లు దేశంలోని అన్ని ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. హోండా షైన్ రూ.లక్ష రేంజ్ లో వచ్చే మంచి బైక్. ఈ మోటార్‌సైకిల్‌లో 4 స్ట్రోక్, ఎస్ఐ, బీఎస్-VI ఇంజన్ ఉన్నాయి. ఈ ఇంజన్ 7,500 ఆర్పీఎం వద్ద 7.9 కేడబ్ల్యూ శక్తిని, 6,000 ఆర్పీఎం వద్ద 11 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బైక్ ఇంజన్‌కి 5 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా కనెక్ట్ చేశారు. ఢిల్లీలో ఈ హోండా బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 81,251 నుంచి ప్రారంభం అవుతుంది.


ప్రస్తుతం మనదేశంలో రూ.లక్ష లోపు అందుబాటులో మంచి బైక్స్ ఇవే. ఇవి కాకుండా ఇంకా కొన్ని బైక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఈ రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?