Top 5 Bikes Under 3 Lakh: మార్కెట్లో వివిధ సెగ్మెంట్లలో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి, వాటి ధరల రేంజ్ కూడా భిన్నంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు రూ. మూడు లక్షల లోపు ధరలో కొత్త బైక్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ సెగ్మెంట్‌లో ఐదు మంచి ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ 452 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ 'షెర్పా' ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 40 పీఎస్ పవర్‌ని, 5,500 ఆర్పీఎం వద్ద 40 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.69 లక్షలుగా నిర్ణయించారు.
హోండా హెచ్'నెస్ సీబీ350
హోండా హెచ్'నెస్ సీబీ350 బైక్‌లో 348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో లాంచ్ అయింది. ఇది 5,500 ఆర్పీఎం వద్ద 21 పీఎస్ పవర్‌ని, 3,000 ఆర్పీఎం వద్ద 30 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో పెయిర్ అయింది. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఇది బ్రేకింగ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో 310 ఎంఎం ఫ్రంట్, 240 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.09 లక్షలుగా ఉంది.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310 స్ట్రీట్‌ఫైటర్‌లో 312.7 సీసీ రివర్స్ ఇంక్లైన్డ్, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అందించారు. ఇది 9,700 ఆర్పీఎం వద్ద 35.6 పీఎస్ పవర్‌ని, 6,650 ఆర్పీఎం వద్ద 28.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, స్లిప్పర్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు కాగా, ఇది గంటకు 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 2.81 సెకన్లలో, 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.19 సెకన్లలో అందుకుంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.42 లక్షలుగా ఉంది.
జావా 42 బాబర్
జావా 42 బాబర్ ఓబీడీ-2 కంప్లైంట్ 334 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌తో వచ్చింది. ఇది 29.9 పీఎస్ పవర్, 32.74 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. బీఎస్6 స్టేజ్ 2 అప్‌డేట్ తర్వాత మెరుగైన పనితీరు కోసం జావా ఇంజిన్‌ను పెద్ద థ్రోటెల్ బాడీ, ఎగ్జాస్ట్ పోర్ట్‌తో ట్యూన్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.25 లక్షలుగా ఉంది.
బజాజ్ డొమినార్ 400
బజాజ్ డొమినార్ 400లో 373.3 సీసీ డీవోహెచ్‌సీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉపయోగించారు. ఈ ఇంజన్ 8800 ఆర్పీఎం వద్ద 40 పీఎస్ పవర్‌ని, 6500 ఆర్పీఎం వద్ద 35 ఎన్ెం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.29 లక్షలుగా ఉంది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!