Best Budget Cars in 2023: 2023లో కార్ల తయారీ కంపెనీలు ప్రీమియం కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పాటు బడ్జెట్ ఎస్‌యూవీలపై కూడా చాలా శ్రద్ధ పెట్టారు. 2023లో ఈ విభాగంలో కొన్ని మంచి కార్లు భారతీయ మార్కెట్లో విడుదల అయ్యాయి. ఇప్పుడు ఇందులో బెస్ట్ మోడల్స్ చూద్దాం.


హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter)
హ్యుందాయ్ లాంచ్ చేసిన అతి చిన్న ఎస్‌యూవీ ఎక్స్‌టర్. అయితే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ చాలా ఫీచర్లను కలిగి ఉంది. బాక్సీ లుక్స్‌తో పాటు ఇది సరికొత్త హ్యుందాయ్ డిజైన్ డిటైలింగ్‌ను కూడా పొందుతుంది. ఎక్స్‌టర్‌లో చాలా ఎక్కువ స్థలం అందుబాటులో ఉంది. ఏఎంటీ వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్టర్‌లు ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇది సేఫ్టీ, గ్రౌండ్ క్లియరెన్స్, కంప్లీట్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా కూడా మంచి ఆప్షన్. దీని ప్రైస్ పాయింట్‌ను పరిగణనలోకి తీసుకుంటే పెట్టే డబ్బులకి మంచి విలువను అందిస్తుంది. ఈ కొత్త ఎక్స్‌టర్ 1.2 లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌తో లభిస్తుంది.


మారుతీ సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx)
దీని లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్న ఎస్‌యూవీగా ఇది మారుతి అందిస్తున్న ఉత్తమమైన ఆఫర్. దీని టర్బో పెట్రోల్ ఇంజన్‌తో ఇది చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. అయితే దీని ధర 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కంటే కొంచెం ఎక్కువ. దీని డిజైన్ మినీ గ్రాండ్ విటారా మాదిరిగానే స్టైలింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇది చాలా విశాలమైన క్యాబిన్‌ను కూడా కలిగి ఉంది. ఏఎంటీ వేరియంట్‌లో వచ్చే 1.2 లీటర్ పెట్రోల్ చాలా బాగుంది. అధిక పనితీరు గల టర్బో పెట్రోల్ కూడా గొప్ప ఆప్షన్.


ఎంజీ కామెట్ (MG Comet EV)
చిన్న ఎంజీ కామెట్ కూడా చాలా ఆసక్తికరమైన ఎలక్ట్రిక్ కారు. ఇది అత్యంత సరసమైన ఈవీ మాత్రమే కాకుండా భారతదేశంలోని అతి చిన్న కార్లలో ఒకటి కూడా. అయినప్పటికీ కామెట్ చాలా ఫీచర్లను కలిగి ఉంది. దీని సైజు చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ఇది చాలా స్థలంతో వస్తుంది. ఇక రేంజ్ గురించి చెప్పాలంటే కామెట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దాని రన్నింగ్ ధర కూడా పెట్రోల్ హ్యాచ్‌బ్యాక్ కంటే చాలా తక్కువగా ఉండనుంది. సాధారణ కొత్త బడ్జెట్ కార్లలో కామెట్ చాలా భిన్నమైనది, చవకైనది కూడా.


హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024లో లాంచ్ చేయడానికి అనేక కొత్త కార్లను కలిగి ఉంది. కంపెనీ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 జనవరి 16వ తేదీన లాంచ్ చేయనుంది. దీని తర్వాత కంపెనీ అప్‌డేట్ చేసిన అల్కజార్, టక్సన్ ఎస్‌యూవీలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వీటితోపాటు హ్యుందాయ్ తన మొదటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, క్రెటా ఈవీని కూడా ప్రదర్శిస్తుందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నారు. ఈ కారు చాలాసార్లు టెస్టింగ్‌లో కూడా కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి త్వరలో లాంచ్ చేయనున్న ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారిత ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2024 ద్వితీయార్థంలో రానుంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!