Best 125cc Scooters in India: భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో స్కూటర్ అనేది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు. అది ఒక ఎమోషన్, ఆఫీసు పనులు, ఇంటి అవసరాలు, పిల్లల స్కూల్ డ్రాపింగ్స్, ఇలా అన్నింటికీ స్కూటరే ఆధారమైపోయింది. ఒకప్పుడు 100 సీసీ లేదా 110 సీసీ స్కూటర్లు మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ కాలం మారింది. ఇప్పుడు జనాలు పవర్‌తోపాటు మైలేజ్ ఇచ్చే 125సీసీ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా లక్షలోపు బడ్జెట్‌లో స్మార్ట్ ఫీచర్లు, స్పోర్టీ డిజైన్, 52 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అద్బుతమైన ఆఫ్షన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఐదు రకాల స్కూటర్ల గురించి తప్పక తెలుసుకోవాలి.
యమహా ఫాసినో125
మీరు రోడ్లపై వెళ్తుంటే అందరూ మీ స్కూటర్ వైపు చూడాలి అనుకుంటే యమహా ఫాసినో కొనుక్కోండి. ఇది భారత్‌లో అత్యంత స్టైలిష్ రెట్రో స్కూటర్‌లలో ఒకటి. దీని కర్వీ డిజైన్ ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ఇందులో హైబ్రిడ్ అసిస్ట్ సిస్టమ్ ఉంది. ఇది స్కూటర్ ఆగి బయలుదేరేటప్పుడు అదనపు పవర్‌ను ఇస్తుంది. బ్లూటూత్ కనెక్టవిటీ, ఎల్‌ఈడీ లైట్స్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇది లీటర్‌కు సుమారు 52 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు 74, 910 నుంచి ప్రారంభమవుతుంది.
టీవీఎస్ జూపిటర్ 125
ప్రాక్టికాలిటీ, సౌకర్యం కోరుకునే వారికి జూపిటర్ 125 ఒక మంచి వరం లాంటిది. ఇందులో ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ ఉండటం వల్ల సీటు దిగాల్సిన పని లేదు. సీటు కింద చాలా ఎక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇద్దరి హెల్మెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇది సుమారు 50 కిలోల మైలేజీ అందిస్తుంది. దీని ధర సుమారు 78, 700 నుంచి మొదలవుతుంది.
సుజుకి యాక్సెస్ 125
ఏళ్ల తరబడి భారత్ మార్కెట్‌లో తన ఉనికిని చాటుకుంటున్న స్కూటర్ ఇది. సుజుకి యాక్సెస్ దాని స్మూత్ ఇంజిన్, కంఫర్ట్‌బుల్ రైడ్ క్వాలిటీకి పేరుగాంచింది. లేటెస్ట్ మోడల్‌లో బ్లూటూత్ ఎనేబుల్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త రంగులు అందుబాటులోకి వచ్చాయి. దీని ధర సుమారు 79,885 నుంచి మొదలవుతుంది.
టీవీఎస్ ఎన్-టార్క్ 125
మీకు వేగం, స్టైల్, అగ్రెసివ్ లుక్ కావాలంటే ఎన్‌టార్క్ కంటే మెరుగైన ఆప్షన్ లేదు. దీని అగ్రెసివ్ బాడీ, షార్ప్ లుక్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇందులో డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసి నావిగేషన్, రైడ్ అనలిటిక్స్ చూసుకోవచ్చు. ఇది 81 వేల నుంచి ప్రారంభమవుతుంది.
హోండా డియో 125
సిటీ ట్రాఫిక్‌లో సులువుగా దూసుకుపోవడానికి హోండా డియో 125 అద్భుతంగా పని చేస్తుంది. దీని స్పోర్టీ గ్రాఫిక్స్, షార్ప్ ఫ్రంట్ ఎండ్ దీనికి ప్రత్యేక గుర్తింపు ఇస్తాయి. హై ఎండ్ వేరియంట్‌లలో టీఎఫ్‌టీ డిస్‌ప్లే, స్మార్ట్ కీ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. దీని ధర సుమారు 87 వేల నుంచి ప్రారంభమవుతుంది.
Also Read:నిసాన్ టక్టాన్ దెబ్బకు దిగ్గజాలు షేక్ అవ్వాల్సిందే! రూ. 11 లక్షలకే హైబ్రిడ్ మ్యాజిక్... మైలేజీ చూస్తే మైండ్ బ్లాక్!
పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో మంచి పవర్‌తోపాటు మైలేజ్ ఇచ్చే వాహనం అవసరం. 125సీసీ స్కూటర్లు హైవేపై, సిటీ ట్రాఫిక్‌లో సమానమైన పని తీరు చూపిస్తాయి. మీ పాత 100సీసీ పదే పదే రిపేర్లు వస్తున్నా, లేదా మీరు మొదటిసారి వాహనం కొంటున్నా, లక్ష లోపు బడ్జెట్‌లో ఇవి మంచి ఆప్షన్లు.
Also Read:పెరిగిన పెట్రో ధరలు: ఇంధన ఖర్చులు తగ్గించుకునేలా డ్రైవింగ్ హ్యాబిట్స్, మెయింటెనెన్స్ వివరాలు ఇవే
కేవలం మైలేజ్, స్టైల్ కావాలనుకుంటే యమహా ఫాసినో ఎంచుకోవచ్చు. ఎక్కువ లగేజీ, ఫ్యామిలీ సౌకర్యం కావాలంటే టీవీఎస్ జూపిటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నమ్మకం రీసేల్ వాల్యూ కావాలంటే మాత్రం సుజుకి యాక్సెస్ మంచిది. వేగం, టెక్నాలజీ కావాలంటే టీవీఎస్ ఎన్‌టార్క్ ఉత్తమమైన ఎంపిక.
Also Read:ట్రయంఫ్ టైగర్ 900 సరికొత్త ఎడిషన్లు లాంచ్ - ఆల్పైన్, డెజర్ట్ మోడళ్ల ఫీచర్లు, ప్రైస్ డీటైల్స్
ఈ ఐదు స్కూటర్లు తమదైన ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఒకప్పుడు స్కూటర్లు అంటే కేవలం తిరగడానికి మాత్రమే అనుకునేవారు ఇప్పుడు అందులో బ్లూటూత్, హైబ్రిడ్ అసిస్ట్ వంటి టెక్నాలజీలు వచ్చేశాయి. మీ అవసరాలు, మీ వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని టెస్ట్ రైడ్ చేయండి.
