Nissan Tekton Hybrid SUV India: భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల హా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సి-సెగ్మెంట్‌లో హ్యుందాయ్‌, క్రెటా, కియా సెల్టోస్‌ వంటి కార్లు ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్నాయి. అయితే, ఈ మోనోపోలీకి గండి కొట్టేందుకు జపాన్ దిగ్గజం నిసాన్ సిద్ధమైంది. అద్భుతమైన మైలేజీ, అదిరిపోయే ఫీచర్లు, జేబుకు చిల్లు పడకుండా ఉండే ధరతో నిసాన్ టెక్టాన్‌ పేరుతో సరికొత్త హైబ్రి్‌ ఎస్‌యూవీని రంగంలోకి దించుతుంది. 

Continues below advertisement

నిసాన్ ఇండియా తన ఉనికిని చాటుకోవడానికి ప్రవేశపెడుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్. ఇది ఒక ప్రీమియం మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీ. అంతర్జాతీయంగా పేరుగాంచిన నిసాన్ పెట్రోల్‌ డిజైన్ ఫిలాసఫీని ఈ కారులో మనం చూడొచ్చు. కండలు తిరిగిన బాడీ, అగ్రెసివ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌, ముందు నుంచి వెనుక వరకు ఉన్న ఎల్‌ఈడీ లైట్ బార్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తోంది. 

ఎందుకు నిసాన్ ప్రత్యేకమైంది?

సాధారణంగా హైబ్రిడ్‌ కార్లు అంటే ధర ఎక్కువగా ఉంటాయని ఒక అభిప్రాయం ఉఁది. కానీ నిసాన్ ఆ అంచనాను తలకిందులు చేసింది. నిసాన్ టెక్టాన్‌లోని స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్‌ నగర ప్రాంతాల్లో లీటరుకు 25 కిలోమీటర్లు కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని అంచనా. పెట్రోల్ ధరలు మండిపోతున్న  రోజుల్లో ఇది సామాన్యులకు పెద్ద రట. ఇంతటి హై ఎండ్‌ ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ప్రారంభ ర కేవలం 11 లక్షలు ఉండవచ్చని సమాచారం. ఇది క్రెటా, సెల్టోస్ వంటి కార్ల బేస్ వేరియంట్ల ధరతో సమానం. కేవలం మైలేజ్ మాత్రమే కాదు. విలాసవంతమైన క్యాబిన్ కూడా దీన సొంతం. 

Continues below advertisement

విడుదల తేదీ ఎప్పుడంటే?

నిసాన్ టెక్టాన్ హైబ్రిడ్‌ అధికారిక ఆవిష్కరణ జులై 9, 2026న జరగనుంది. ఈ కారును పూర్తిగా భారత్‌లోని తయారు చేసిన, ఇక్కడి మార్కెట్‌తోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేయాలని నిసాన్ భావిస్తోంది. 

ఫీచర్లు- టెక్నాలజీ 

నిసాన్ టెక్టాన్ లోపలి భాగం ఒక విలాసవంతమైన హోటల్ గదిని తలపిస్తోంది. ట్రిపుల్ టోన్ కలర్ స్కీమ్, పెద్ద టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌, ఫుల్లీ డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 

కుటుంబాలతో ప్రయాణించే వారికి అనువుగా వెనుక సీటు ప్రయాణీకులకు ఎక్కువ ప్రాధాన్య ఇచ్చారు. పనోరమిక్ సన్‌రూఫ్‌, వెంటిలేటెడ్ సీట్లు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తాయి. నిసాన్ ఇందులో మూడు రకాల ఇంజిన్లు అందించే ఛాన్స్ ఉంది. 1.0L టర్బో పెట్రోల్, 1.3L టెర్బో పెట్రోల్, 1.5L స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఇంజిన్లు రావచ్చు.

భద్రతకు పెద్దపీట

నిసాన్‌ టెక్టాన్ కేవలం వేగం, డిజైన్ మీ మాత్రమే కాకుండా భద్రత మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో లెవల్‌ 2  అడాస్‌ ఉంది. ఆటోమేటిక్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్‌ వంటి ఫీచర్లు ప్రమాదాలకు నివారించడంలో సహాయపడతాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, టీపీఎంఎస్, ఏబీఎస్‌ విత్ ఈబీడీ, 360 డిగ్రీ కెమెరా వంటి అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా వచ్చే అవకాశం ఉంది. 

నిసాన్‌ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటీ?

నిసాన్ ఇండియా గ కొంతకాలంగా భారత మార్కెట్‌లో వెనుకబడి ఉంది. అయితే, టెక్టాన్ రూపంలో అది తన పూర్వవైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. హ్యూందాయ్‌ క్రెట్, కియా సెల్టోస్‌, రాబోయే కొత్త డస్టర్‌ వంటి కార్లతో ఇది నేరుగా తలపడనుంది. బలమైన డిజైన్, హైబ్రిడ్‌ ఎఫిషియన్సీ, సరసమైన ధర... ఈ మూడు అస్త్రాలతో నిసాన్ వినియోగదారులను ఆకర్షించాలని చూస్తోంది. 

నిసాన్ టెక్టాన్ కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది నిసాన్ కంపెనీకి ఒక గేమ్‌ ఛేంజర్‌ కానుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌, లగ్జరీ ఫీచర్లు కావాలనుకునే భారతీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వినియోగదారులకు ఇది ఒక వర ప్రసాదం అని చెప్పవచ్చు.