Rambha Emotional Post About Her Father Death : టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ రంభ ఎమోషనల్ పోస్ట్ చేశారు. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
'నాన్నా ఐ మిస్ యూ'
తన హృదయంలో తండ్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు రంభ. 'నా హృదయంలో నీకున్న స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని నాకు తెలుసు. మనం గొడవపడినా, నేను ఇబ్బందులు కలిగించినా ఎప్పుడూ అదే చిరునవ్వుతో అన్నింటినీ ఎదుర్కొన్నావు. నువ్వు లేకపోవడంతో ఈ ప్రపంచం శూన్యంగా అనిపిస్తోంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను నాన్నా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
Also Read : మళ్లీ ఛాన్స్ ఇస్తే నటిస్తా - చిరు ఆపద్బాంధవుడు ఫేం మీనాక్షి శేషాద్రి... 30 ఏళ్ల తర్వాత
రంభ మూవీ జర్నీ
విజయవాడకు చెందిన రంభ అసలు పేరు యూది విజయలక్ష్మి. తొలుత మలయాళంలో ఛాన్స్ రాగా... 1992లో 'సర్గామ్' మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు'లో హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్‌తో బావగారూ బాగున్నారా, వెంకటేశ్, నాగార్జున ఇలా స్టార్ హీరోస్ అందరితో వరుసగా మూవీస్ చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు.
తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాళీ భాషల్లో మూవీస్ చేశారు. 2010లో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రకుమార్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం రియాలిటీ, టీవీ షోలకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంతలోనే ఈ విషాదం నెలకొంది. సినీ జర్నీ ప్రారంభ దశలో తనకు తన తండ్రి అండగా నిలిచినట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
Also Read : ధనుష్ కర To శరవణన్ లీడర్ - ఈ వారం ఓటీటీల్లో ఒకేసారి 19 మూవీస్
