This Week OTT Movies Complete List : ఈ వారం ఓటీటీల్లో యాక్షన్ ఎంటర్టైనర్స్ నుంచి హారర్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వరకూ స్ట్రీమింగ్ కానున్నాయి. సోమవారం (మే 25) నుంచి ఆదివారం (మే 31) వరకూ డిఫరెంట్ ఓటీటీల్లో అందుబాటులోకి రాబోయే మూవీస్, వెబ్ సిరీస్ ఏంటో ఓసారి చూస్తే...
ధనుష్ 'కర'
కోలీవుడ్ స్టార్ ధనుష్, ప్రేమలు ఫేం మమితా బైజు ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ రూరర్ యాక్షన్ థ్రిల్లర్ కర. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.
శరవణన్ 'లీడర్'
ఫేమస్ బిజినెస్ మ్యాన్, లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లీడర్. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా... శరవణన్‌తో పాటు పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 29 నుంచి 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.
కమెడియన్ సత్య 'జెట్లీ'
కమెడియన్ సత్య హీరోగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ' ఓటీటీలోకి వచ్చేసింది. రితేశ్ రానా దర్శకత్వం వహించిన ఈ మూవీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సత్యతో పాటు వెన్నెల కిశోర్, అజయ్, రియా సింఘా, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Also Read : స్టార్ హీరోస్ హిట్స్ వెనుక త్రిష మ్యాజిక్ - ఫ్యాన్ పోస్టుకు సౌత్ క్వీన్ రియాక్షన్
అమెజాన్ ప్రైమ్ వీడియో : యానిమల్ ఫార్మ్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), డిజర్ట్ వారియర్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), ఫ్యూజ్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), మై బెస్ట్ ఫ్రెండ్స్ డెడ్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), ఓవర్ యువర్ డెడ్ బాడీ (ఇంగ్లీష్ మూవీ - మే 26), టూ ప్రాసిక్యూటర్స్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), టు వుమెన్ (ఇంగ్లీష్ మూవీ - మే 26), స్పైడర్ నోయర్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 27), లీడర్ (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 29), ది లాస్ట్ వి కింగ్ (ఇంగ్లీష్ మూవీ - మే 29).
నెట్ ఫ్లిక్స్ : షెరిఫ్ లాబ్రాడార్ (ఇంగ్లీష్ మూవీ - మే 25), అన్‌టోల్డ్ యూకే : విన్ని జోన్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ - మే 26), మై టు సెంట్స్ (ఇంగ్లీష్ మూవీ - మే 27), కర (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 28), ఎమీ మార్టింజ్ (ఇంగ్లీష్ మూవీ - మే 28), మర్డర్ మైండ్ ఫుల్లీ (జర్మన్ సిరీస్ - మే 28), ద ఫోర్ సీజన్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - మే 28), కలబాసస్ కాన్ఫిడెంటల్ (ఇంగ్లీష్ సిరీస్ - మే 29), రఫా (ఇంగ్లీష్, స్పానిష్ సిరీస్ సీజన్ 1 - మే 29), బ్రెజిల్ 70 (మే 29).
జియో హాట్ స్టార్ : జెట్లీ (తెలగు మూవీ - మే 25), బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్ - మే 27), కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (తెలుగు డబ్బింగ్ సిరీస్ - మే 29).
సన్ నెక్స్ట్ : ఫేసెస్ (తెలుగు డబ్బింగ్ మూవీ - మే 29) లయన్స్ గేట్ ప్లే : ద రేస్ (రొమేనియన్ మూవీ - మే 29).
యాపిల్ టీవీ ప్లస్ : ప్రొపెల్లర్ వన్ వే నైట్ కోచ్ (ఇంగ్లీష్ మూవీ - మే 29), స్టార్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్ - మే 29), HBO మ్యాక్స్ : ది మూమెంట్ (ఇంగ్లీష్ మూవీ - మే 29).
Also Read : సమంత 'మా ఇంటి బంగారం' ట్రైలర్ లాంచ్ ఇవాళే... ఎక్కడ? ఎప్పుడు? ఫుల్ డీటెయిల్స్ తెల్సా?
