Offer on Bajaj Chetak: బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 'పండుగ ఆఫర్'ను అందిస్తోంది. దీని కింద ఫేమ్-2 సబ్సిడీ తర్వాత ఇప్పుడు ఢిల్లీ/బెంగళూరులో ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.30 లక్షలకు పెరిగింది. ఇటీవలి ఫేమ్-2 సబ్సిడీలో మరింత కోత విధించిన తర్వాత ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.44 లక్షలకు చేరింది. అంటే ఇప్పుడు వినియోగదారులకు ఈ పండుగ సీజన్ సందర్భంగా ఈ వాహనం కొనుగోలుపై రూ. 14,000 భారీ తగ్గింపు లభించనున్నారు.


కంపెనీ ఈ ఆఫర్‌ను దేశం మొత్తానికి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయాన్ని తెలపలేదు. కానీ పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అవుతుందని బజాజ్ తెలిపింది. ఈ పండుగ ధర ఆఫర్ ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.


బజాజ్ చేతక్ ఒకప్పుడు మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఈ-స్కూటర్. కానీ ఇటీవలి ధరల అప్‌డేట్‌తో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు చాలా ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారింది. మార్కెట్‌లో ఉన్న ఇతర ఈ-స్కూటర్ సెగ్మెంట్ వాహనాలలో ఏథర్ 450ఎక్స్ ధర ఇప్పుడు రూ. 1.38 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అయితే దాని ప్రో ప్యాక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.53 లక్షల వరకు ఉంది.


ఓలా ఎస్1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ.1.47 లక్షలు. ఇది కాకుండా టీవీఎస్ ఐక్యూబ్ ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు రూ. 1.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాని ఎస్ వేరియంట్ కోసం రూ. 1.40 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక విడా వీ1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.46 లక్షలుగా ఉంది. అంటే ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉన్న ప్రముఖ మోడళ్లలో బజాజ్ చేతక్ ప్రస్తుత ధర అత్యల్పంగా ఉంది.


పోటీ వీటితోనే...
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 ప్రోతో పోటీపడుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 181 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందిస్తుంది. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది.


ఈ బైక్‌లో 3.8కేడబ్ల్యూ మోటార్ ను అందించారు. నాన్ రిమూవ‌బుల్ 3కేడ‌బ్ల్యూహెచ్ ఐపీ67 లిథియం-ఇయాన్ బ్యాట‌రీ ప్యాక్ ను బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌లో అందించారు. బ‌జాజ్ చేత‌క్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ టాప్ స్పీడ్ గంటకు 70 కిలోమీట‌ర్లు కాగా, పూర్తిగా చార్జ్ పెట్టి ఎకో మోడ్ లో డ్రైవ్ చేస్తే 95 కిలోమీట‌ర్ల దూరం వరకు ప్ర‌యాణించ‌వ‌చ్చు. 5ఏ ప‌వ‌ర్ సాకెట్ ద్వారా ఇంట్లోనే దీన్ని చార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, బ్లూటూత్ ఆప్ష‌న్ ఉన్న ఇన్ స్ట్రుమెంట్ క‌న్సోల్, స్మార్ట్ ఫోన్ యాప్ ఫంక్ష‌నాలిటీస్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial