ఎయిర్‌బ్యాగ్స్ అనేవి సాధారణంగా మనం కార్లలోనే చూస్తూ ఉంటాం. అయితే ద్విచక్రవాహనాలకు కూడా ఎయిర్‌బ్యాగ్స్ అందించే ప్రయత్నం జరుగుతోంది. పియాజియో, ఆటోలివ్ కంపెనీలు కలిసి ఈ ప్రయోగం చేయనున్నాయి. ఈ రెండు కంపెనీలు కలిసి ద్విచక్రవాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ రూపొందిస్తున్నారు. ఆటోలివ్ ఇప్పటికే దీనికి సంబంధించిన ఇనీషియల్ కాన్సెప్ట్‌ను తయారు చేసింది. అడ్వాన్స్‌డ్ సిమ్యులేషన్ టూల్స్, ఫుల్ స్కేల్ క్రాష్ టెస్టులను కూడా నిర్వహించింది.


అయితే ఇప్పుడు ఈ రెండు కంపెనీలూ కలిసి, ఈ ప్రాజెక్టును మరింత ముందుకు వెళ్లనున్నాయి. త్వరలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి ఎక్కువగా అందుబాటులో లేవు. అయితే టూ వీలర్ ఫ్రేమ్‌లో వీటిని అమర్చనున్నారని, మిల్లీ సెకన్లలోనే ఇవి డిప్లాయ్ అవుతాయని తెలుస్తోంది.


ఆటోలివ్ సీఈవో, ప్రెసిడెంట్ మికాయెల్ బ్రాట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కువ మందిని కాపాడాలనే ఉద్దేశంతో వరల్డ్ క్లాస్ లైఫ్ సేవింగ్ సొల్యూషన్స్‌ను అందించడానికి ఆటోలివ్ కృషి చేస్తోందన్నారు. దీంతో పాటు సరిగ్గాలేని రోడ్ల మీద ప్రయాణం చేసేవారిని కాపాడటానికి కొత్త ఉత్పత్తులను రూపొందిస్తున్నామన్నారు.


2030 నాటికి లక్ష మందిని రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో ఈ ఉత్పత్తులను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెరుగైన రోడ్డు భద్రత కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది కచ్చితంగా అభినందించదగ్గ విషయం. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో ద్విచక్రవాహనాల వాడకం చాలా ఎక్కువైంది.


ద్విచక్రవాహనాలు సులభంగా రవాణా చేయగలగడం, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్లలో కూడా బైక్‌లు, స్కూటర్లను సులభంగా ఉపయోగించవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం వస్తున్న బైకుల్లో సేఫ్టీ సిస్టమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. యాబ్స్, ఏఎస్ఆర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. ఈ ఎయిర్ బ్యాగ్స్ కూడా అందుబాటులోకి వస్తే.. రోడ్లపై రైడర్స్‌కు సేఫ్టీ మరింత పెరగనుంది.


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


Also Read: TVS Raider: కొత్త బైక్ వచ్చేసింది.. రూ.80 వేలలో బెస్ట్.. అదిరిపోయే లుక్, ఫీచర్లు!


Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!


Also Read: Car Comparision: 2021 టొయోటా ఫార్ట్యూనర్ వర్సెస్ ఎంజీ గ్లోస్టర్.. ఏది బెస్ట్ అంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి