Audi TT Sports Discontinued: జర్మన్ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడి దాని అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటైన టీటీ స్పోర్ట్స్ కారును నిలిపివేయనుంది. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టీటీ, టీటీఎస్ స్పోర్ట్స్ కార్లను ఇప్పుడు కూపే, రోడ్‌స్టర్ బాడీ స్టైల్స్‌తో గత ఎడిషన్‌ల ద్వారా తీసుకురానున్నారు. టీటీ సిరీస్‌కు చెందిన ఈ ఫైనల్ ఎడిషన్ కార్లు ప్రత్యేక స్టైలింగ్ ప్యాక్‌ను పొందుతాయి. ప్రామాణిక బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ ఆడియో సిస్టంను కలిగి ఉంటాయి.


చివరి ఎడిషన్ ఎలా ఉంటుంది?
ఈ కారు 'అల్టిమేట్ ఎడిషన్' TT 40 TFSI, 45 Quattro, TTS వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కూపే, రోడ్‌స్టర్ బాడీ స్టైల్స్ ఈ మూడు వేరియంట్‌ల్లో అందుబాటులో ఉంటాయి. కొత్త మోడల్‌ను స్టాండర్డ్ టీటీ నుంచి వేరు చేయడానికి, ఆడి బ్లాక్ బ్యాడ్జింగ్, బ్లాక్ ORVMలు, బ్లాక్ టెయిల్‌పైప్‌లు, బ్లాక్ రియర్ స్పాయిలర్‌తో కూడిన బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీని జోడిస్తుంది.


కన్వర్టిబుల్ బ్లాక్ రోల్‌ ఓవర్ బార్‌ల సెట్‌ను కూడా కొత్త ఎడిషన్‌ల్లో అందించనున్నారు. దీని బ్రేక్ కాలిపర్‌లకు ఎరుపు రంగులో పెయింట్ చేశారు. అలాగే 20 అంగుళాల ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆడి టీటీఎస్ మోడల్లో సెవెన్ స్పోక్ స్పోర్ట్ అల్లాయ్ వీల్స్‌ను ఉండనున్నాయి..


వీటిని కొనాలంటే ఎంత ఖర్చు అవుతుంది?w
లోపలి భాగంలో ఈ 'ఫైనల్ ఎడిషన్' కార్లు లెదర్-ఫినిష్డ్ ఆర్మ్‌రెస్ట్, లెదర్-ఫినిష్డ్ స్టీరింగ్ వీల్, డోర్ హ్యాండిల్స్, ఆల్కాంటారా లెదర్‌తో ఆడి రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో అప్‌డేట్ అయిన క్యాబిన్‌ను పొందుతాయి. ఈ ఫైనల్ ఎడిషన్ కార్ల ధరలు 50,455 డాలర్ల నుంచి 67,942 డాలర్ల మధ్యలో ఉంటాయి. అంటే భారతదేశ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ. 41.75 లక్షల నుంచి రూ. 56.23 లక్షల మధ్యలో ఉంటాయి. అయితే, కంపెనీ ఈ కారు ఫైనల్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.


25 ఏళ్ల చరిత్ర
ఆడి తొలిసారిగా 1995లో TT స్పోర్ట్స్‌ను ఒక కాన్సెప్ట్ కారుగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత దాని మొదటి తరం ఉత్పత్తి మోడల్ విక్రయం 1998లో ప్రారంభమైంది. దీని రెండో తరం మోడల్ 2006లో లాంచ్ అయింది. ప్రస్తుతం విక్రయిస్తున్న మూడో తరం మోడల్ 2014లో అందుబాటులోకి వచ్చింది. టీటీ తన రజతోత్సవాన్ని 2023లో జరుపుకోనుంది. అంటే మార్కెట్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్న మాట. ఆడి ఈ ఏడాది చివరి నాటికి ఈ కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది.


బీఎండబ్ల్యూ ఎం2 కూపేతో పోటీ
ఆడి టీటీ, బీఎండబ్ల్యూ ఎం2 కారుతో పోటీపడుతుంది. దీంతో 2979 సీసీ పెట్రోల్ ఇంజన్‌ను అందించనున్నారు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. దీని పొడవు 4461 మిల్లీ మీటర్లు కాగా, వెడల్పు 1854 మిల్లీ మీటర్లుగానూ ఉంది. దీని వీల్ బేస్ 2693 మిల్లీ మీటర్లుగా ఉంది.