Mahindra BE 05 Launching Soon: భారతీయ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా ఈవీ సెగ్మెంట్ మార్కెట్లో అద్భుతమైన కారును తీసుకురానుంది. కంపెనీ తన ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ సిరీస్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఎలక్ట్రిక్ కారు అయిన మహీంద్రా బీఈ 05 వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా ఈ సంవత్సరం చివరి నాటికి భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది.
సౌండ్ డిజైన్ ఏఆర్ రెహమాన్‌కి...
మహీంద్రా బీఈ 05 (Mahindra BE 05) అనేది స్పోర్టీ కూపే స్టైల్ ఎస్‌యూవీ. బీఈ 05 సింగిల్ మోటార్ లేదా డ్యూయల్ మోటార్ లేఅవుట్‌తో అందుబాటులో ఉంటుంది. బీఈ 05... 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహనాలలో ప్రత్యేక డ్రైవ్ మోడ్ సౌండ్‌ని సృష్టించడానికి ఏఆర్ రెహమాన్‌తో (AR Rahman) చేతులు కలిపింది.
ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది ప్రీమియం 16 స్పీకర్ ఆడియో సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మహీంద్రా బీఈ 05 డాల్బీ అట్మాస్, హర్మాన్ కార్డాన్‌తో నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు టచ్‌స్క్రీన్ డామినేటెడ్ లేఅవుట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, వెహికల్ టు లోడ్ (V2L), ఇతర ఫీచర్లు కూడా ఈ సిరీస్ కార్లలో కనిపిస్తాయి.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
ధర ఎంత ఉండవచ్చు?
ఏఆర్త రెహమాన్, ఆయన బృందం డ్రైవ్ మోడ్, డ్యాష్‌బోర్డ్‌తో పాటు అన్ని ఇతర ఫంక్షన్‌ల కోసం అన్ని సౌండ్‌లను డిజైన్ చేస్తారు. ఈ మహీంద్రా ఈవీ ధర రూ.20 నుంచి 25 లక్షల మధ్యలో ఉండబోతోంది. బీఈ 05 ప్రొడక్షన్ వెర్షన్‌లో పెద్ద సీ-ఆకారపు డీఆర్ఎల్స్‌తో కూడిన పెద్ద అద్దాలు ఉంటాయి.
ఇది స్ప్లిట్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, పెద్ద ఎల్ఈడీ లైట్ బార్‌ను కూడా కలిగి ఉంది. వీటిని మునుపటిలానే ఉంచారు. ఈ టెస్ట్ కారును చూస్తే ఇది చాలా పొడవుగా ఉందని, దాని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుందని స్పష్టమవుతుంది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల రేంజ్‌లో థార్ ఎలక్ట్రిక్ కూడా త్వరలో చేరనుంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో మహీంద్రా లాంచ్ చేసిన అనేక ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తాయి.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Take the leap into a world of infinite possibilities with our first public showcase of the BE.RALL-E at the Bharat Mobility Global Expo 2024. 🌐⚡️#InfinitePossibilities #Bharatmobility2024 #Taketheleap #MahindraE-SUVs pic.twitter.com/UJ6yRwBGGD
— Mahindra Electric SUVs (@mahindraesuvs) February 1, 2024