5 Door Force Gurkha Teaser: ఫోర్స్ మోటార్స్ చాలా కాలంగా గూర్ఖా 5 డోర్ల వెర్షన్‌ను సిద్ధం చేస్తోంది. 5 డోర్ల గూర్ఖా టెస్ట్ మ్యూల్స్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సార్లు కనిపించాయి. అయితే ఈ నెలాఖరులో జరగనున్న మీడియా రైడ్ ఈవెంట్‌లో ఇది లాంచ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాంచ్‌కు ముందు కంపెనీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రాబోయే 4×4 ఎస్‌యూవీ టీజర్‌ను మరోసారి విడుదల చేసింది. కొత్త 5 డోర్ వెర్షన్‌తో పాటు, ఫోర్స్ ఇప్పటికే ఉన్న 3 డోర్ వెర్షన్ గూర్ఖాని కూడా అప్‌డేట్ చేస్తుందని టీజర్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. లాంచ్ అయిన తర్వాత, 5 డోర్ల గూర్ఖా... మారుతి జిమ్నీ, త్వరలో రానున్న 5 డోర్ల మహీంద్రా థార్ వంటి కార్లతో పోటీపడుతుంది.


5 డోర్ ఫోర్స్ గూర్ఖా ఎక్స్‌టీరియర్
మునుపటి టీజర్ తరహాలోనే 5 డోర్ల గూర్ఖా తాజా చిత్రాలు ఈ వాహనం సిల్హౌట్‌ను మాత్రమే చూపుతాయి. దాని 3 డోర్ వెర్షన్ మాదిరిగానే, 5 డోర్ల ఫోర్స్ గూర్ఖా పొడవాటి పిల్లర్లు, ఫ్లాట్ రూఫ్‌లైన్‌తో బాక్సీ ప్రొఫైల్‌తో వస్తుంది. టీజర్ పెద్ద గ్రీన్‌హౌస్ ఏరియాను కూడా చూపుతుంది. ప్రతి వైపు మూడు విండో ప్యానెల్‌లుగా డివైడ్ చేశారు.


తాజా టీజర్, మునుపటి స్పై షాట్‌ల మధ్య కనిపించే ఒక తేడా ఏమిటంటే స్క్వేర్ హెడ్‌లైట్లు లేకపోవడం. టీజర్‌లో ఫోర్స్ 3 డోర్ గూర్ఖాలో కనిపించే ఇంటిగ్రేటెడ్ రౌండ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో కూడిన సిగ్నేచర్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను ఉపయోగించినట్లు చూపించారు. టీజర్‌లో వెనుకవైపు నిలువు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కనిపిస్తుంది. 






Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!


5 డోర్ ఫోర్స్ గూర్ఖా లాంచ్ త్వరలోనే
3 డోర్ గూర్ఖాలో కనిపించే 16 అంగుళాల వీల్స్ కాకుండా 5 డోర్ వెర్షన్ 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందే అవకాశం ఉంది. ముందు, వెనుక బంపర్లను కూడా అప్‌డేట్ చేయవచ్చు. 5 డోర్ల గూర్ఖా దాని 3 డోర్ల వెర్షన్ కంటే చాలా పొడవుగా ఉంటుంది. టైల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్, రూఫ్ మౌంటెడ్ లగేజ్ రాక్, జెర్రీ క్యాన్, స్నార్కెల్ వంటి విజువల్ హైలైట్‌లు ఈ లైఫ్‌స్టైల్ అడ్వెంచర్ వెహికల్‌కు ఆకర్షణను పెంచుతాయి.


5 డోర్ ఫోర్స్ గూర్ఖా ఇంజిన్ ఏది?
గూర్ఖా 5 డోర్‌లో ప్రస్తుతం ఉన్న 2.6 లీటర్  4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఇది 90 బీహెచ్‌పీ శక్తిని, 250 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రత్యేకంగా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. లో రేంజ్ ట్రాన్స్‌ఫర్ కేసు ద్వారా నాలుగు చక్రాలకు శక్తి సమానంగా పంపిణీ అవుతుంది. మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్ ఆఫ్ రోడింగ్ సామర్థ్యాలు కూడా మెరుగుపరిచారు.


Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?