2023 Hyundai i20 N Line Launched: హ్యుందాయ్ ఐ20లో కంపెనీ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కూడా ఉండనుంది. ప్రస్తుతం ఉన్న మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను పాత ఐఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో రీప్లేస్ చేశారు.


డిజైన్, ఫీచర్లు ఇలా
దీని డిజైన్, ఫీచర్ల విషయానికి వస్తే... ఇందులో కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉండనున్నాయి. అలాగే ఈ కారులో 16 అంగుళాల అలోయ్ వీల్స్ ఉండనున్నాయి. ఈ కారుపై ఎన్ బ్రాండింగ్‌ను కూడా చూడవచ్చు. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (వీఎస్ఎం), 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఆల్ డిస్క్ బ్రేక్స్, ఆటోమేటిక్ రేర్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు అందించారు.


దీంతో 35 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఎన్ లోగో ఉన్న 3-స్పోక్ స్టీరింగ్ వీల్, ఎన్ లోగో ఉన్న లెదర్ సీట్లు, లెదర్ కవర్డ్ గేర్ షిఫ్టర్, రెడ్ యాంబియంట్ లైటింగ్ ఇంటీరియర్‌లో అందించారు. కొత్త ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం కూడా ఉంది. 7 స్పీకర్ బోస్ సిస్టం, 60కి పైగా కార్ కనెక్టెడ్ ఫీచర్లు, 127 ఎంబెడెడ్ వీఆర్ కమాండ్స్, 52 హింగ్లిష్ వాయిస్ కమాండ్స్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్, సీ-టైప్ ఛార్జర్ ఫీచర్లు అందించారు.


దీని ఇంజిన్ ఎలా?
ఇందులో 1.0 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. మాన్యువల్, డీసీటీ ఆప్షన్లు ఉండనున్నాయి. ఎన్6, ఎన్8 ట్రిమ్‌ల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఇంజిన్ ఎంటీ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ డీసీటీ వేరియంట్ ధర రూ.12.3 లక్షలుగా ఉంది. ఇది ఎక్స్ షోరూం ధర మాత్రమే. ప్రస్తుతం మనదేశంలో ఉన్న ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఇది కూడా ఒకటి.


Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలనుకుంటున్నారా? అయితే వీటిని చెక్ చేయాల్సిందే!


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial