December 2023 Monthly Horoscope : 2023 సంవత్సరంలో ఆఖరి నెలలో ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభాలే. ఈ నెలలో గ్రహాల సంచారం మీకు అనుకూల ఫలితాలనిస్తోంది...
కర్కాటక రాశి (Cancer Horoscope in Telugu) (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
కర్కాటక రాశి వారికి 2023 డిసెంబరు నెల అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. అనుకున్న పనులు టైమ్ కి పూర్తిచేస్తారు..మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో ఎరి పెళ్లి గురించి అయినా జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకుంటాయి. మిత్రులతో కొనసాగుతున్న విబేధాలు సమసిపోతాయి. ఆదాయానికి లోటుండదు..కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.మీ లక్కీ నంబర్ 6, కలిసొచ్చే రంగు మరూన్.
సింహ రాశి (Leo Horoscope in Telugu)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
డిసెంబరు నెల సింహరాశివారికి బావుంటుంది. సమస్యలు మబ్బులు వీడినట్టు వీడిపోతాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. నెలాఖరులో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. ఈ నెల మీ అదృష్ట సంఖ్య 8. కలిసొచ్చే రంగు గ్రే.
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
కన్యా రాశి (Virgo Horoscope in Telugu) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
2023 ఆఖరి నెల కన్యారాశివారికి మంచి ఫలితాలే ఉన్నాయి.ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది కానీ నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది..ధైర్యంగా ముందడుగు వేయండి. నెల మధ్యలో జరిగే ఒప్పందాల విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనికి మీ కుటుంబం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నత స్థానం పొందొచ్చు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఈ నెలలో మీ అదృష్ట సంఖ్య 1, కలిసొచ్చే రంగు బ్రౌన్.
తులా రాశి (Libra Horoscope in Telugu) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
తులారాశివారికి డిసెంబరు నెలలో గ్రహాల అనుగ్రహం బాగానే ఉంది. వృత్తి, వ్యాపారాలలో శుభ ఫలితాలున్నాయి. కుటుంబంసలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. తల్లిదండ్రులకు సమయం కేటాయిస్తారు. పిల్లల పురోగతి చూసి సంతోషిస్తారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. బయటి ఆహారానికి దూరంగా ఉండడమే మంచిది. నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీ అదృష్ట సంఖ్య 3, మీకు కలిసొచ్చే రంగు గులాబీ.
Also Read: ఈ రాశులవారు ఒత్తిడి తగ్గించుకోకుంటే కష్టమే, నవంబరు 29 రాశిఫలాలు
కుంభ రాశి (Aquarius Horoscope in Telugu) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
2023 సంవత్సరంలో చివరి నెల మీకు శుభ ఫలితాలను అందిస్తోంది. వృత్తిపరమైన రంగంలో కీర్తిని పొందవచ్చు..ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. మీ మాటతీరు స్నేహపూర్వక సంబంధాలను పెంచుతుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సోదరులతో సఖ్యత ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి. మీ అదృష్ట సంఖ్య 9, కలిసొచ్చే రంగు నీలం.
Also Read: దశమి, ఏకాదశి కాకుండా మిగిలిన తిథులు మంచివి కావా, ఏ తిథి ఎలాంటి ఫలితం ఇస్తుందో తెలుసా!
మీన రాశి (Pisces Horoscope in Telugu) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
మీన రాశివారికి డిసెంబర్ 2023 అనుకూల ఫలితాలున్నాయి. వ్యవహారాలు కలిసొస్తాయి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ప్రారంభించిన కొన్ని పనుల్లో సవాళ్లు ఎదురవుతాయి కానీ ధైర్యంగా ఉండండి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బావుంటుంది. మంతిర్లు సహకారంలో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ జీవితం బావుంటుంది. పెళ్లి దిశగా ఆలోచించే ప్రేమికులకు శుభసమయం ఇది. మీ అదృష్ట సంఖ్య 6 , కలిసొచ్చే రంగు తెలుపు.
మిగిలిన ఆరు రాశుల ఫలితాలు తెలుసుకునేేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply