Weekly Horoscope January 29 to February 4th: జనవరి 29 సోమవారం నుంచి ఫిబ్రవరి 4 ఆదివారం వరకూ ఈ 4 రాసులవారికి శుభఫలితాలు లేవు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలి. ఆ నాలురు రాశులు ఇవే...
మిథున రాశి ( Gemini weekly Horoscope)
మిథున రాశి వారికి ఈ నెల చివరి వారం అంత అనుకూల ఫలితాలు లేవు. ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. చేపట్టిన పనుల్లో చాలా అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శారీరక మరియు మానసిక ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగంలో కూడా కొన్ని సవాళ్లు ఎదురువుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. అర్థవంతమైన సంభాషణలలో మీ ఆలోచనలను బహిరంగంగా పంచుకోండి. మీకున్న స్పాంటెనిటీ ఎలాంటి సవాళ్లనైనా అధిగమించేలా చేస్తుంది
Also Read: నాగోబా జాతర చరిత్ర ఏంటి - ఇందులో నిర్వహించే 'భేటి కొరియాడ్' గురించి తెలుసా!
కర్కాటక రాశి ( Cancer weekly Horoscope)
ఈ వారం కర్కాటక రాశి వారికి ఎదురుదెబ్బలు తగలవచ్చు. సన్నిహిత సంబంధీకులతో వివాదాలుంటాయి. వ్యాపారంలో భారీగా నష్టపోయే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరగవచ్చు. ప్రారంభించిన పనుల్లో ఒడిదొడుకులుంటాయి. సమస్యల్ని అధిగమించి ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. మీ నిజమైన భావాలను వ్యక్తపరచడానికి బయపడకండి. మీ బలహీనత మీ బలం.
Also Read: అమావాస్య అర్థరాత్రి ప్రారంభమయ్యే అద్భుతమైన జాతర - నాగోబా నమోనమః!
వృశ్చిక రాశి (Scorpio weekly Horoscope)
జనవరి ఆఖరివారం వృశ్చిక రాశివారికి కూడా పెద్దగా కలసిరాదు. వారం ప్రారంభం నుంచి అంత అనుకూల పరిస్థితులు ఉండవు. ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకునే అవకాశం ఉంది. కార్యాలయంలోనూ మీ బాధ్యతల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం పనిభారం పెరుగుతుంది. ముక్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మనసులో పేరుకుపోయిన ఆలోచనల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం.
Also Read: మకరంలో 3 గ్రహాలు - ఈ 3 రాశులవారికి ఊహించనంత ప్రయోజనం!
ధనుస్సు రాశి (weekly weekly Horoscope)
చాలా సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ధనస్సు రాశివారికి జనవరి ఆఖరివారంలోనూ కొన్ని ఒడిదొడుకులుంటాయి. ఇప్పటికే కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారికి మరికొంతకాలం తిరగడం తప్పదు. అనుకోని సమస్యలు వచ్చి పడతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెడిచే చాలా నష్టపోతారు. ఉద్యోగులుకు పనిభారం పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలోనూ ఊహించని వివాదాలు ఎదురవుతాయి. మీ దినచర్యలో మార్పును స్వీకరించండి, అది వ్యక్తిగత వృద్ధికి దారి తీస్తుంది. మీ ఆశావాద దృక్పథం సానుకూల శక్తిని, అవకాశాలను ఆకర్షిస్తుంది. మున్ముందు ప్రయాణంపై నమ్మకం ఉంచండి.
Also Read: మరణం తర్వాత కొన్ని గంటలపాటూ గుండె కొట్టుకోవడం వెనుక కారణం ఇదే!
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాలు మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.