Weekly Horoscope 26 February to 3 March 2024 


మేష రాశి (Aries Weekly Horoscope)


ఈ వారం మీకు అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు..మంచి ఫలితాలు సాధిస్తారు. సహోద్యోగులతో మాట్లాడడం వల్ల మీ మనసు తేలికపడుతుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా ప్రేమతో నిండి ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి రోజు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. 


వృషభ రాశి  (Taurus Weekly Horoscope)


వృషభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి..అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. నూతన పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన వాయిదా వేసుకోవడం మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా అనిపిస్తుంది.   సామాజిక సంస్థలలో మీ ముద్ర వేయడానికి అవకాశం పొందుతారు.  పనికి తగిన గుర్తింపు లభిస్తుంది .


Also Read: ఈ రాశులవారికి సంపద, సంతోషం - ఫిబ్రవరి 25 ఆదివారం రాశిఫలాలు


మిథున రాశి (Gemini Weekly Horoscope)


ఈ వారం మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని విషయాల్లో టెన్షన్ పెరుగుతుంది. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనిని అడ్డంకులు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇది మంచి సమయమే. మీ ఆలోచనా విధానంలో మార్పు చేసుకోవాల్సిన సమయం ఇది.


కర్కాటక రాశి (Cancer Weekly Horoscope) 


కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది.  వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి .  మీ వ్యూహాత్మక స్థితిని మెరుగుపరచుకోవాలి. మీ లక్ష్యాల వైపు పురోగతి సాధించడానికి ప్రయత్నించాలి. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీ ప్రియమైన వారితో మంచి సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితం బావుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి. పనిలోనే ఆనందం వెతుక్కుంటారు.


Also Read: రోజూ ఉదయాన్నే గాయత్రి మంత్రం పఠిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!


సింహ రాశి (Leo Weekly Horoscope)


సింహ రాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి.  ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవాలి ... ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి.  కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. పనికి సంబంధించిన విషయాలలో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. 


కన్యా రాశి (Virgo Weekly Horoscope)


ఈ వారం కన్యారాశి వారికి సవాలుగా ఉంటుంది. వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి . చాలాకాలం తర్వాత స్నేహితులను కలుస్తారు. వైవాహికి జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది..ఖర్చులు తగ్గుతాయి. చేపట్టిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: రెండు దేహాలు ఒక్కటిగా కనిపించడమే అర్థనారీశ్వర తత్వమా?


తులా రాశి (Libra Weekly Horoscope)


ఈ వారం తులారాశి వారికి సాధారణంగా ఉంటుంది. మీరు మీ పనిలో కష్టపడి పని చేయాలి. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగించుకోవడం మంచిది.  ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా బాగుంటుంది. ఈ వారం వ్యాపార వర్గాలకు కూడా మంచిది. వ్యాపార భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండాలి. వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు. ప్రేమ జీవితం ఈ వారం చాలా బాగుంటుంది.  


వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)


ఈ వారం వృశ్చికరాశి వారికి అంతా అనుకూల సమయం. మీ ప్రయత్నాలకు తగిన ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు లక్ష్యాల సాధనకు ప్రయత్నించాలి. కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. పర్యటనకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ జీవితం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏవో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు.


Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు


ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope)


ధనుస్సు రాశి వారికి ఈ వారం సవాలుగా ఉంటుంది. కష్టపడాలి..చేపట్టిన పూర్తిచేసేందుకు సవాళ్లను అధిగమించాలి. వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది.  ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.  వైవాహిక జీవితంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి. 


మకర రాశి (Capricorn Weekly Horoscope)


మకరరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది.   మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు అవసరం మరియు వారితో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించండి. ఆదాయం సాధారణంగా ఉంటుంది..ఖర్చులు పెరుగుతాయి. దూరప్రాంత ప్రయాణాలు చేసేందుకు ఇది అనుకూల సమయం కాదు. 


కుంభ రాశి (Aquarius Weekly Horoscope)


కుంభరాశి వారికి ఈ వారం మంచిది. మీరు సామాజిక సంస్థలలో మీ ముద్ర వేయడానికి అవకాశం పొందుతారు. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది మరియు మీ గౌరవం పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు.  మీ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, కొన్ని ఆకస్మిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. ఉద్యోగస్తులు చాలా కష్టపడాల్సి వస్తుంది.  


Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే!


మీన రాశి (Pisces Weekly Horoscope)


మీనరాశి వారికి ఈ వారం ఏ అనుకున్నా నెరవేరుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. దూరప్రాంత ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది


గమనిక:  ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.