Weekly Horoscope 23 to 29 January 2023: జనవరి 23 నుంచి 29 వరకూ ఈ రాశులవారికి ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే ఉన్నాయి...ఇందులో మీరున్నారా చెక్ చేసుకోండి...
మిథున రాశి
ఈ వారం మిథున రాశి విద్యార్థులకు ప్రత్యేకం. వారంలో గడిచే ప్రతి రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...అందుకే..నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఇదే మంచి సమయం. ఇతరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించేకన్నా మీ జీవనశైలిని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి.పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పొరుగువారితో వివాదం తలెత్తవచ్చు. మీరు ఆధ్యాత్మిక పర్యటనకు వెళతారు. ఉద్యోగులు, వ్యాపారులకు కష్టానికి తగిన ఫలితాలుంటాయి.
కన్యా రాశి
ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనవసర ఆందోళనలు విడిచిపెట్టండి. మీ ధైర్యం మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. మీ చుట్టూ ఉండే వ్యక్తులు కొందరు వారి ఎదుగుదల కోసం మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది జాగ్రత్త. వారం ప్రారంభంలో చేతిలో డబ్బుల్లేక కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను పూర్తి చేయడం కష్టంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు కొంత సామాగ్రి కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. పిల్లలు చేసిన పనికి మీరు గర్వపడతారు. విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. విజయం సాధించాలంటే వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.
Also Read: ఈ రాశివారికి మానసిక ఒత్తిడి, ఆ రాశివారికి ఆర్థిక సమస్యలు - జనవరి 23 నుంచి 29 వారఫలాలు
వృశ్చిక రాశి
ఈ వారం మీకు గ్రహస్థితి బావుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది..అంత మాత్రాన నిర్ణయం తీసుకోవడంలో అజాగ్రత్తగా ఉండాలని కాదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే అవకాశాలను పొందుతారు.ఈ వారం వృశ్చికరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించవచ్చు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం కూడా ఇదే అని గుర్తుపెట్టుకోవాలి. వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గుతాయి. జీవిత భాగస్వామి యొక్క సలహా ముఖ్యమైన విషయాలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి.
మకర రాశి
ఈ వారం మీకు మంచి అవకాశాలను తెస్తుంది. సోమరితనం నుంచి దూరంగా ఉండటంలో విజయవంతమైతే, ఈ వారం ఆర్థికంగా మీ పరిస్థితి బావుంటుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. స్థిరాస్తి, వాహన కొనుగోలు ప్రణాళిక పూర్తవుతుంది. దాంపత్య జీవితంలో ప్రేమ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి...లేకపోతే లేనిపోని వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. విద్యార్థులు సమయపాలనపై శ్రద్ధ వహించాలి. వృత్తిపరంగా మీ సీనియర్ సభ్యులు ఎవరైనా అనవసరమైన సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు..మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం
Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!
మీన రాశి
ఈ వారమంతా మీరు ఆనందంగా ఉంటారు. చాలా పనుల నుంచి డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీరు మీ ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తుంది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల నుంచి మంచి సహకారం అందుతుంది. అత్తమామల పక్షం నుంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. విద్యార్థులు కార్యాలయంలో మీ పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు.