Ugadi panchangam in telugu 2024 to 2025 : రానున్న ఐదేళ్లలో అధికారం దక్కించుకునేదెవరు? ఏ ఏ రాశుల రాజకీయ నాయకులను విజయలక్ష్మి వరిస్తుంది?...మీ రాశి ప్రకారం గ్రహాలు మీకు అనుకూలమా ప్రతికూలమా? ఇక్కడ తెలుసుకోండి...


మేష రాశి రాజకీయనాయకులు


శ్రీ క్రోధి నామ సంవత్సరం మేష రాశి రాజకీయ నాయకులకు మంచి ఫలితాలనిస్తుంది. పోటీచేస్తే మాత్రం గెలవడం పక్కా. ప్రజల్లో, అధిష్టాన వర్గంలో గుర్తింపు లభిస్తుంది. అయితే ఆర్థిక ఇబ్బందలు ఎదుర్కోక తప్పదు.


వృషభ రాశి రాజకీయనాయకులు


ఈ రాశి నాయకులకు ఉగాది తర్వాత నుంచి అదృష్టం కలిసొస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. డబ్బు భారీగా ఖర్చుచేయాల్సి  వస్తుంది కానీ అందుకు తగిన ఫలితం పొందడంతో ఉపశమనంగా ఫీలవుతారు అయితే మీరు నమ్మినవారే మీకు అన్యాయం చేస్తారు...అప్రమత్తంగా ఉండండి. 


Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశుల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మామూలుగా లేదు - మిగిలిన వ్యాపారుల పరిస్థితేంటి!


మిథున రాశి రాజకీయ నాయకులు 


మిథున రాశి రాజకీయ నాయకులకు గత ఎన్నికల కన్నా ఈ సారి శనిబలం కలిసొస్తుంది. గడిచిన ఎన్నికల సమయంలో శని మైనస్ అయితే రానున్న ఎన్నికల్లో మిథున రాశివారికి శని ప్లస్ అవుతుంది. పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం సాధిస్తారు. డబ్బు మాత్రం భారీగానా ఖర్చవుతుంది. 


కర్కాటక రాశి రాజకీయ నాయకులు


కర్కాటక రాశి రాజకీయ నాయకులకు కూడా డబ్బు పోయినా విజయం వరిస్తుంది. అధిష్టానం నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. 


సింహ రాశి రాజకీయ నాయకులు


ఎప్పుడూ సింహంలా ఉండే సింహ రాశివారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం పెద్దగా కలసిరాదు. ఈ రాశి రాజకీయనాయకులకు అష్టమంలో రాహువు సంచారం ముంచేస్తుంది. చేయని తప్పులకు నిందలు పడతారు. ప్రజల్లో - పార్టీలో ఆదరణ తగ్గిపోతుంది. ఆశించిన పదవులు పొందడం మాట దేవుడెరుగు, ఎన్నికల్లో గెలవడం కూడా చాలా కష్టమే. నమ్మిన వారి చేతిలోనే వెన్నుపోటుకి గురవుతారు. 


Also Read: ఉగాది తర్వాత ఈ రాశుల ఉద్యోగుల జీవితంలో కొత్త వెలుగులే - ఆ 2 రాశులవారికి మినహా!


కన్యా రాశి రాజకీయనాయకులు


ఈ రాశి రాజకీయనాయకులకు శని అనుగ్రహం ఉంటుంది. శని శుభ స్థానంలో ఉండడం వల్ల ప్రజల్లో , పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు పొందుతారు. పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే భారీగా డబ్బు వెదజల్లినా గెలుస్తారని మాత్రం పక్కాగా చెప్పలేం...


తులా రాశి రాజకీయనాయకులు


తులా రాశివారికి గ్రహాల అనుగ్రహం అనుకూల ఫలితాలనిస్తోంది. మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. రానున్న ఎన్నికల్లో పోట చేస్తే గెలుపు మీదే. పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా మంచి పదవిని పొందుతారు. శత్రువులకు చెక్ పెట్టడంలో మీరు సిద్ధహస్తులు.


వృశ్చిక రాశి రాజకీయ నాయకులు


శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి రాజకీయ నాయకులకు గురుబలం బావుంది. ప్రజల్లో, అధిష్టానం దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎన్నికల్లో బొటా బొటిగా  విజయం సాధిస్తారు. అయితే ఏలినాటి  శని ప్రభావం వల్ల ఖర్చులు భారీగా ఉంటాయి..ఆస్తులు కోల్పోతారు. 


Also Read: 60 ఏళ్లకి బ్యాక్ టు చైల్డ్ హుడ్ - తెలుగు సంవత్సరాల నంబర్ వెనుక ఆంతర్యం ఇదా!


ధనస్సు రాశి రాజకీయనాయకులు


గత కొన్నేళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ధనస్సు రాశి రాజకీయ నాయకులకు ఉపశమనం లభిస్తుంది. ప్రజల్లో, పార్టీలో పేరు సంపాదిస్తారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మీ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన పదవి కాకపోయినా ఏదో ఒక పదవి మిమ్మల్ని వరిస్తుంది. 


మకర రాశి రాజకీయనాయకులు


మకర రాశి రాజకీయనాయకులకు కూడా శని అనుకూల ఫలితాలనే ఇస్తోంది. ఈ సారి ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు.  ప్రభుత్వంలో భాగం అవుతారు. మిమ్మల్ని ముంచాలని ప్రయత్నించినవారు రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం పక్కా. 


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


కుంభ రాశి రాజకీయనాయకులు


కుంభ రాశి రాజకీయ నాయకులకు ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకూ టైమ్ వెరీ బ్యాడ్. ఎన్నికలు జరిగేది, రిజల్ట్ వచ్చేది ఈలోగానే కదా... అందుకే కుంభ రాశి నాయకులకు గెలుపు సాధ్యం అయ్యే పనికాదు. ధనం ఏరులై పారించినా ఫలితం శూన్యం. మీకు రావాల్సిన నామినేటెడ్ పదవులు కూడా వేరొకరికి చేరిపోతాయి. ఆగష్టు తర్వాత సమస్యల నుంచి కొంత ఉపశమనం మొదలవుతుంది. 


మీన రాశి రాజకీయ నాయకులు


మీన రాశి రాజకీయ నాయకులు పార్టీలో పై అధికారుల కరుణ పొందుతారు. ప్రజాభిమానం కూడా తోడవడంతో రానున్న ఎన్నికల్లో గెలుపు పక్కా. ఖర్చు తప్పదు కానీ విజయం వరిస్తుంది. 


Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!


Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.