SRH Vs CSK Sunrisers Hyderabad won by 6 wkts: చెన్నై(csk) తో జరిగిన పోరులో హైదరాబాద్‌(srh) రెండో విజయం సాధించింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 166 పరుగుల టార్గెట్‌ను నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి ఛేదించింది.  ఐదెన్‌ మార్‌క్రమ్‌  హాఫ్ సేన్చరీ  పూర్తి చేయగా , అభిషేక్ శర్మ , ట్రావిస్‌ హెడ్ లు అదరగొట్టారు. చెన్నై బౌలర్లు మొయిన్‌ అలీ 2.. దీపక్‌ చాహర్, తీక్షణ చెరో వికెట్‌ తీశారు. చెన్నై నిర్దేశించిన 166 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్‌ 18.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ ఐదో స్థానానికి చేరుకుంది. చెన్నై మూడో స్థానంలో కొనసాగుతోంది. 


అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నైని హైదరాబాద్‌ 20 ఓవర్లలో 5 వికెట్లు తీసి 165 పరుగులకే కట్టడి చేసింది. మొదట టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బరిలో దిగిన  చెన్నైకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌  పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(12)ను ఔట్ చేశాడు. ర‌చిన్ భారీ షాట్ ఆడ‌బోయి మ‌ర్క్‌రమ్ చేతికి చిక్కాడు. దాంతో, 25 ప‌రుగుల వ‌ద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేప‌టికే రుతురాజ్ గైక్వాడ్(26)ను ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్ వెన‌క్కి పంపాడు. 54 ప‌రుగుల‌కే రెండు వికెట్లు ప‌డిన సీఎస్కేను రహానే, దూబేలు ఆదుకున్నారు. దీంతో చెన్నై స్కోరు 12 ఓవర్లకు 105కు చేరింది.  దూకుడుగా ఆడుతున్న శివమ్‌ దూబె  ను పాట్ కమిన్స్ 45 పరుగుల స్కోర్ వద్ద ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన స్లో బంతిని 13.4వ ఓవర్  వద్ద  భువీకి క్యాచ్‌ ఇచ్చి దూబె పెవిలియన్‌కు చేరాడు. దీంతో 119 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్‌ను కోల్పోయింది. తరువాత జయ్‌దేవ్‌ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానె  ఔటయ్యాడు. తరువాత హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. స్లో డెలివరీలను సంధిస్తూ పరుగులను బాగా  నియంత్రించారు. 16వ ఓవర్‌లో నటరాజన్‌ ఐదు పరుగులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ను భువీ వేశాడు. ఒకానొక సమయంలో వికెట్ పడిపోతే ధోనీ వస్తాడు కదా అన్న ఆలోచనలో పడిపోయారు అభిమానులు.  అనుకున్నట్టు గానే డారిల్ మిచెల్ 13 పరుగులకే  ఔటయ్యాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో సమద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఉప్పల్‌ మైదానం ధోనీ నామస్మరణతో హోరెత్తింది.క్రీజ్ లో ఉన్న రవీంద్ర జడేజా  చివరి ఓవర్‌ ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచాడు. అలాగే క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ  ఒకేఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 


తరువాత బరిలో దిగిన  హైదరాబాద్‌ (Hyderabad) మరోసారి చెలరేగింది.  ఉప్పల్‌ వేదికగా సొంతమైదానంలోచెన్నై తో జరిగిన పోరులో 4 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. 166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్‌క్రమ్‌, అభిషేక్‌ శర్మ ట్రావిస్‌ హెడ్‌  విలువైన పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో అలీ 2, దీపక్‌ చాహర్‌, తీక్షణ తలో వికెట్‌ తీశారు.