Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024):  శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 కర్కాటక రాశి ఫలితాలు
కర్కాట రాశి
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
ఆదాయం : 11 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4


శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో కర్కాటక రాశివారి గ్రహస్థితి పరిశిలిస్తే.. సంపదకు కారకుడైన గురుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహుకేతువులు శుభ స్థానంలో ఉన్నారు. అయితే శని అష్టమంలో ఉన్నందుకు మిశ్రమ ఫలితాలున్నాయి. గురుబలం వల్ల జీవితం సంతోషంగా ఉంటుంది...ఇంటా-బయటా కొన్ని ఇబ్బందులున్నప్పటికీ ధైర్యంగా దూసుకెళతారు. ఇంకా ఈ ఉగాది నుంచి కర్కాటక రాశివారి జీవితంలో ఎలాంటి మార్పలు రాబొతున్నాయంటే...



  • 2023-2024 శోభకృత్ నామసంవత్సరంలో ఆర్థికంగా పుంజుకుంటారు కానీ మానసికంగా చాలా కుంగిపోతారు. కానీ అంతలోనే మీకు మీరు ధైర్యం చెప్పుకుని ముందుకుసాగుతారు.

  • మీలో ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కష్టాలు తప్పవు..కానీ సంఘంలో మీకున్న గౌరవం పోదు..

  • మీకన్నా చిన్నవారివలన అపవాదులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ఔన్నత్యాన్న కోల్పోతారు

  • అనుకున్న పనుల్లో చాలావరకూ మధ్యలోనే నిలిచిపోతాయి.  ఇల్లు మారే పరిస్థితులు రావొచ్చు. ఆప్తుల మరణం మిమ్మల్ని బాధిస్తుంది

  • భార్య-భర్త మధ్య సరైన అవగాహన ఉండదు..మాటపట్టింపులు పెరుగుతాయి

  • ఏడాది ద్వితీయార్థంలో తీర్థయాత్రలు చేస్తారు, ప్రతి విషయంలోనూ అడ్డంకులు పెరుగుతాయి


Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!


ఉద్యోగులకు 


ఉద్యోగులకు ఈ ఏడాది గురుబలం బావుంది..మీపై ఉన్నతాధికారులకు మంచి అభిప్రాయం ఉంటుంది...కానీ అష్టమ శని ప్రభావం వల్ల అనుకోని మార్పులు కొన్ని జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు మంచి ఫలితాలు పొందుతారు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్నవారికి ఇంకొంత కాలం కష్టాలు తప్పవు


రాజకీయ నాయకులకు


రాజకీయాల్లో ఉన్నవారికి కూడా గురుబలం కలిసొస్తుంది. అధిష్టానం నుంచి మంచి మార్కులు కొట్టేస్తారు..ప్రజల్లో పలుకుబడి పెంచుకోగలుగుతారు. ఈ రాశివారు ఎన్నికల్లో పోటీచేస్తే..చివరకి వరకూ విజయం దోబూచులాడినా ఎట్టకేలకు విజేతగా నిలుస్తారు. మనోధైర్యం కోల్పోతారు.. శత్రువుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు


కళాకారులకు


కర్కాటక రాశి కళాకారులకు శ్రీ శోభకృత్ నామసంవత్సరం బాగానే ఉంటుంది. మీక్కూడా గురుబలం అండగా ఉంటుంది. నూతన అవకాశాలు దక్కించుకుంటారు. ఎటువైపు అడుగేసినా విజయం సాధిస్తారు...మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు


Also Read:  శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో 5 రాశుల వారికి ఆదాయం పెరిగితే , ఈ 3 రాశులవారికి ఖర్చులు పెరుగుతాయి


వ్యాపారులకు


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వ్యాపారులకు కూడా అనుకూల ఫలితాలే ఉన్నాయి. హోల్ సేల్, రీటైల్ వ్యాపారం చేసేవారికి బావుంటుంది కానీ భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి పెద్దగా కలసిరాదు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి బావుంటుంది.. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అంతగా కలసిరాదు, ఈ రాశి ఇనుము-ఇటుల వ్యాపారులకు నష్టాలు తప్పవు


విద్యార్థులకు


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షలు బాగా రాస్తారు. ఇతర వ్యాపకాలవైపు మళ్లకుండా చదువుపై దృష్టి సారించడం మంచిది. 


వ్యవసాయదారులకు


ఈ రాశి వ్యవసాయదారులకు రెండు పంటల్లో ఒకటి మాత్రమే లాభిస్తుంది. కౌలు చేసేవారికి పెద్దగా కలసిరాదు. చేపలు, రొయ్యల చెరువులు చూసేవారికి మంచి ఫలితాలే ఉన్నాయి



  • పునర్వసు, పుష్యమి నక్షత్రాల వారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో సామాజిక గౌరవం,అధికార యోగం

  • ఆశ్లేష నక్షత్రం వారికి ధనం, కుటుంబం వృద్ధి


2023-2024 మేషరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి....


2023-2024  వృషభరాశి ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి