ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు తెలిపారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఎస్సెస్సీ లేదా మొదటి ఏడాది హాల్‌టికెట్ నంబరుతో థియరీ పరీక్షల హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రెండో ఏడాది వారు మొదటి సంవత్సరం లేదా రెండో ఏడాది హాల్‌టికెట్ నంబరుతో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్లలో ఫొటోలు, సంతకాలు, ఇతర సవరణలు అవసరమైతే కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి, సరిచేయించుకోవాలని శేషగిరిబాబు సూచించారు. 


ఇంటర్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


 ఇంట‌ర్‌ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..


➥ మార్చి 15 - బుధవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1


➥ మార్చి 17 - శుక్రవారం - ఇంగ్లిష్ పేపర్-1


➥ మార్చి 20 - సోమవారం - మ్యాథ్స్‌ పేపర్‌-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.


➥ మార్చి 23 - గురువారం - మ్యాథ్స్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1


➥ మార్చి 25 - శనివారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్‌ పేపర్-1


➥ మార్చి 28 - మంగళవారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1


➥ మార్చి 31 - శుక్రవారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).


➥ ఏప్రిల్ 3 - సోమవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1



Also Read: తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యతేదీలివే! 



ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూలు..


➥ మార్చి 16 - గురువారం - సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్-2


➥ మార్చి 18 - శనివారం - ఇంగ్లిష్‌ పేపర్-2


➥ మార్చి 21 - మంగళవారం - మ్యాథ్స్‌ పేపర్‌-2ఎ, బోటనీ, సివిక్స్-2.


➥ మార్చి 24 - శుక్రవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్‌-2.


➥ మార్చి 27 - సోమవారం - ఫిజిక్స్ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.


➥ మార్చి 29 - బుధవారం - కెవిుస్ట్రీ పేపర్‌-2, కామర్స్ పేపర్‌-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2


➥ ఏప్రిల్ 1 - శనివారం - పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్‌ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).


➥ ఏప్రిల్ 4 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2


AP SSC Exam Hall Tickets: ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
టెన్త్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


TS Inter Exams: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - కంట్రోల్ రూం నెంబర్ ఏర్పాటు, ఫ్రీ కౌన్సెలింగ్ సౌకర్యం
తెలంగాణలో మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్ లను, సంభందిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ లతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లు, సంభందిత అధికారులతో సోమవారం వీడియో సమావేశం నిర్వహించారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..