కనిపించని దైవం ఉన్నాడన్న నమ్మకం ఉన్నపుడు కనిపించని దయ్యం కూడా ఉన్నట్టే అంటారు పెద్దలు. దేవుడనే భావన ఎలాగైతే ధైర్యాన్ని ఇస్తుందో, కష్టాలు దాటేందుకు ఊతంగా ఉంటుందో.. దయ్యం అనే భావన కూడా అలాగే భయాన్ని కలిగించి ధైర్యం కోల్పోయేలా చేస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మీ అని నానుడి. అంటే ధైర్య సాహసాలు కలిగి ఉండడమే నిజమైన లక్ష్మీ ప్రాప్తికి మార్గం అని. ఇలాంటి భయాలను దూరం పెట్టేందుకు మన పురాతన వేద గ్రంథాలలో సైతం కొన్ని ఉపాయాలను సూచించారు. వీటిని పాటించడం వల్ల ఎలాంటి దుష్టశక్తి దరిచేరదు. భయం లేని జీవితాన్ని గడిపేందుకు ఈ ఉపాయాలు దోహదం చేస్తాయి. అయితే వాటి గురించి తెలిసినవారు ఈరోజుల్లో చాలా తక్కువ. ఇలాంటి వివరాలను మనకు కొందరు జ్యోతిష పండితులు అందుబాటులో ఉంచారు. వాటి గురించి తెలుసుకోవడం అవసరం.
సనాతన ధర్మంలో ఇలా భూతప్రేతాల నుంచి విముక్తి పొందేందుకు మార్గాలను కూడా వివరించారు. చరకసంహితలో భూత ప్రేత పీడిత రోగుల లక్షణాలను వాటి నుంచి విముక్తి చెయ్యాల్సిన ఉపాయాలు కూడా చర్చించారు. జ్యోతిష సాహిత్య మూల గ్రంథాలైన ప్రశ్నామార్గం, వృహత్పరాశర్, హోరాసార్, ఫాల్దీపిక, మానసాగరి వంటి వాటిలో జ్యోతిష యోగా గురించిన ప్రస్తావన ఉంది. ఇది ప్రేత పీడ, పితృదోషం వంటి వాటిని వదిలించుకునేందుకు పరిష్కారాలు సూచిస్తోంది. అథర్వవేదంలో ప్రేతాత్మలు, దుష్ట శక్తులను బహిష్కరించేందుకు చాలా ఉపాయాలను వివరించారు. చిన్న చిన్న ఉపాయాలతో దుష్ట శక్తులను దరి చేరకుండా నివారించుకోవడం సాధ్యమే అని శాస్త్రం చెబుతోంది. ప్రేత బాధ నుంచి ఉపషమనం పొందేందుకు ఎలాంటి ఉపాయాలు పాటించాలో తెలుసుకుందాం.
- సానాతన ధర్మంలో ఓం అనే ప్రణవ నాధానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఇంటి ముఖద్వారం మీద ఓం గుర్తును రాసిపెట్టుకోవాలి. ఈ చిహ్నం కనిపిస్తే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. దీనితో పాటు ఇంట్లోని వారందరు దైవానుగ్రహం కలిగిన తాయత్తులను ధరించాలి.
- భూత, ప్రేత, శాకినీ, డాకిని వంటి ప్రేతాత్మల నుంచి రక్షణ పొందేందుకు ఇంట్లో నెయ్యి లేదా ఆవనూనెతో దీపం వెలిగించాలి. ఈదీపపు నుసితో కాటుక తయారు చేసుకోవాలి. ఈ ఉపాయాన్ని దీపావళి రాత్రి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాటుకను ధరిస్తే దుష్ట శక్తులు దరిచేరవు.
- రాత్రి భోజనం తర్వాత వెండి పాత్రలో కర్పూరం, లవంగాలను కాల్చాలి. ఈ పరిహారం దేవస్థానం లేదా ఏదైనా పవిత్రస్థలలాల్లో అకస్మాత్తుగా ఎదురైయ్యే దుష్టశక్తులను ఎదుర్కొనేందుకు తోడ్పడుతుంది. ఈ ఉపాయం రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు చెయ్యాలి.
- రావి చెట్టు నుంచి ఏడు ఆకులను తీసుకొని వాటిని ఇంటిలోని దైవసన్నిధిలో ఉంచి పూజించాలి. ఈ ఆకులు ఎండిపోగానే తొలగించి తిరిగి కొత్త ఆకులను పూజలో ఫెట్టుకోవాలి. తీసేసిన ఆకులను అదే రావి చెట్టు కింద ఖననం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల భూతప్రేతాలు దరి చేరవు.
గమనిక: పండితులు, వివిధ ఆధ్యాత్మిక పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.
Also Read: లవంగాలను ఇలా ఉపయోగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయట