Daily Horoscope for july 30th 2024


మేష రాశి


ఈ రోజు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏదైనా తీవ్రమైన అంశాన్ని కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. అప్పులు తీసుకోవద్దు. ఉద్యోగులు, వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. 


వృషభ రాశి


ఈ రోజు కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.  వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. చట్టపరమైన విషయాలలో అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది


మిథున రాశి


ఈ రోజు మీకు ఏ పనిపైనా శ్రద్ధ ఉండదు. విదేశాలలో వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. ఇతరుల మీద పనిభారం మోపొద్దు. ప్రతికూల వ్యక్తులతో సహవాసానికి దూరంగా ఉండడం మంచిది. 


Also Read: రోజూ ఉదయాన్నే నిద్రలేస్తూ మీరు పాటించాల్సిన 6 ముఖ్యమైన విధులివే..ఎందుకంటే!
 
కర్కాటక రాశి


ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి. కమీషన్ సంబంధిత పనులకు రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగుస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు శుభఫలితాలు పొందుతారు. 


సింహ రాశి 


ఈ రోజు ప్రారంభం బాగా ఉండదు. నూతన ఆలోచనలు చేయవద్దు..పాత ప్రణాళికనే అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు.  మీ ప్రవర్తన చాలా సంయమనంతో  ప్రజల దృష్టిలో ఆదర్శంగా ఉంటుంది. మీరు మీ అభిప్రాయాలను అధికారుల ముందు ప్రభావవంతంగా ప్రదర్శిస్తారు


కన్యా రాశి


ఈ రోజు మీ కోసం మీరు టైమ్ కేటాయించండి. భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఏం చేస్తే మీరు ఆనందంగా ఉంటారో ఆలోచించండి. శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల కుంగిపోతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఉండే వివాదాలు సమసిపోతాయి.  


తులా రాశి


వ్యాపార ఒప్పందాలు ఈ రోజు చేసుకోవద్దు. అప్పులు చేయొద్దు, ఇవ్వొద్దు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు నష్టపోతారు. సహోద్యోగుల సూచనలు మీకు మంచి చేయవు. ఎవ్వర్ని నమ్మి మీ పనని అప్పగించవద్దు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన పట్ల మీరు కొంచెం అసంతృప్తిగా ఉంటారు. అహంకారం తగ్గించుకోవడం మంచిది. 


Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!


వృశ్చిక రాశి


ఈ రాశివారికి ఆర్థిక లాభాలుంటాయి. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ఈ రోజు మీకు అన్నివిధాలుగా అనుకూలమైన రోజు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. 


ధనస్సు రాశి


ఈ రోజు మీరు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. న్యాయపరమైన అడ్డంకులను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. పోటీ పరీక్షలు రాసేవారు శుభ ఫలితాలు పొందుతారు.


మకర రాశి


ఇతర వ్యక్తుల విషయాల్లో అతిగా జోక్యం చేసుకోవడం తగదు. వృత్తి జీవితంలో అంతా సాధారణంగానే ఉంటుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మతపరమైన ఆలోచనలు మీపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి


 Also Read: ఆగష్టులో రాశిమారుతున్న బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు.. ఈ 4 రాశులవారికి సంపద, సంతోషం పెరుగుతుంది!


 కుంభ రాశి


ఈ రాశివారి కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకోవడం కష్టమే. 


మీన రాశి


ఈ రోజు ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి.  విహారయాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ పనులను సకాలంలో పూర్తిచేస్తారు. విద్యార్థులు చదువు విషయంలో చాలా సీరియస్ గా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.