Maharastra Old Women: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో 50 ఏళ్ల మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్ధురాలిని భర్త గొలుసుతో చెట్టుకు కట్టేసి వదిలివెళ్లారు. మూడురోజులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చలిలో వణికిపోతూ పాపం ఆ వృద్ధురాలు ఆ అడవిలోనే ఉంది. ఆమె కేకలు విన్న ఓ గొర్రెలకాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆమెను రక్షించి ఆస్పత్రిలో చేర్పించారు.
విదేశీ మహిళకు వింత అనుభవం
రానురానూ మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే ఆమెను కారడవులపాలు చేశాడు. అసలే మతిస్థిమితం లేని మహిళ. ఆపై 40 రోజులుగా అన్నం తినకుండా నీరసంగా ఉన్న భార్యను ఓ భర్త నట్టడవిలో గొలుసుతో చెట్టుకు కట్టేసి వదిలివెళ్లాడు.ఎండకు, వానకు తడుస్తూ ఆ వృద్ధురాలు చేసిన ఆర్థనాధాలు అరణ్యరోదనగానే మిగిలిపోయాయి. తప్పించుకునిపోయేందుకు ఆమె చేసిన ప్రయత్నాలతో కాలికి కట్టిన ఇనుప గొలుసు రాసుకుపోయి ఆమె కాలు వాచిపోయింది. ప్రాణాలపై ఆశలు వదులుకున్న ఆమె చివరిసారిగా చేసిన అరుపులు ఓ గొర్రెల కాపరి విన్నాడు. అడవి మధ్యలో మహిళ ఏడుపు విని పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. తీరా చూస్తే ఓ వృద్ధురాలి(Old Women)ని ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టేసి ఉండటం చూసి వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు కబురుపెట్టాడు. వారు వచ్చి ఆమె గొలుసు తెంచి వెంటనే ప్రాథమికి చికిత్స కోసం స్థానికంగా ఓ ఆస్పత్రి(Hospital)కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. మహారాష్ట్రాలోని సింధూదుర్గ్ జిల్లా సోనూరు(Sonuru) గ్రామంలో చోటుచేసుకుంది ఈ అమానీయ ఘటన.
అమెరికా నుంచి రాక
ఆమె వద్ద లభించిన పాస్‌పోర్టు(Passport), ఆధార్‌కార్డు(Aadhar Card)లను పరిశీలిస్తే ఆమె అమెరికా(America)కు చెందిన లలితా కయీ కుమార్‌గా గుర్తించారు. పదేళ్ల క్రితమే భారత్ వచ్చిన ఆమె వీసా(Vissa) గడువు కూడా ముగిసిపోయింది. ఆమె వద్ద తమిళనాడు(Tamilanadu) అడ్రస్‌తో ఉన్న ఆధార్‌కార్డు లభించింది. అయితే ఆమె వద్ద లభించిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం ఆమె మానసిక సమస్యతో బాధపడుతోందని వైద్యులు తెలిపారు. అయితే 40 రోజులుగా తాను ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని ఆమె అతికష్టంతో పేపర్‌పై రాసి చూపారు. తన భర్తతో జరిగిన గొడవ కారణంగా అతనే తీసుకొచ్చి ఇలా అడవిలో గొలుసుతో బంధించి వెళ్లిపోయాడని తెలిపింది. తమిళనాడు, గోవాలో ఉన్న ఆమె బంధువులకు సమాచారం ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె భర్త ఎన్నిరోజుల క్రితం ఈ అడవిలో వదిలి వెళ్లిపోయాడో చెప్పలేకపోతోంది.
కఠినాత్ముడు
భార్యాభర్తల మధ్య గొడవులు ఉంటే ఏ రోడ్డుపైనో, గుడివద్దో లేదా వృద్ధాశ్రమాల వద్దో వదిలివెళ్లిపోయే వాళ్లను చూశాం. కానీ లలిత లలితా కయీ కుమార్ భర్త అత్యంత కఠినాత్ముడిలా ఉన్నాడు. దేశంకానీ దేశం వచ్చి తనని నమ్మి పెళ్లిచేసుకున్న భార్య పట్ల ఇంత కిరాతకంగా వ్యవహించాడు. ఎక్కడో తమిళనాడు నుంచి దాదాపు 450 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి మరీ అడవి మధ్యలో చెట్టుకు గొలుసుతో కట్టిపడేశాడంటే...ముందు అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో చూడాలి. 50 ఏళ్ల వయసులో, అందులోనూ మతిస్థిమితం లేని మహిళను అడవిలో కట్టిపడేయడానికి అతనికి మనసు ఎలా వచ్చిందో...? కనీసం వాళ్లు దిగిన రైల్వేస్టేషన్‌లో వదిలిపెట్టినా ఆమె బతుకు ఆమె బతికేది. అడవిలో కూడా తప్పించుకుపోతుందేమోనని గోలుసుతో కట్టిపడేశాడంటే నిజంగా ఆ భర్తకు కూడా మానసిక సమస్యలు ఉన్నట్లు అనుమానం వస్తోంది.