Daily Horoscope for july 27th 2024


మేష రాశి


ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మీ జీవిత భాగస్వామితో బంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కాస్త విజ్ఞత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు మీపనిపట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.


వృషభ రాశి


ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో ప్రోత్సాహం లభిస్తుంది. చాలా పనులు ఏక కాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు.. రోజంతా సంతోషంగా ఉంటారు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు పూర్తిస్థాయిలో చదువుపై శ్రద్ధ వహించాలి


మిథున రాశి


ఈ రాశివారు ఏకపక్ష ప్రవర్తనకు దూరంగా ఉండాలి. కష్టపడి పనిచేస్తారు. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఏదో విషయంలో బాధపడతారు. ప్రేమ జీవితంలో కొత్త మలుపు ఉంటుంది


Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!


కర్కాటక రాశి


ఈ రాశి నిరుద్యోగులు నూతన ఉద్యోగం పొందుతారు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. వ్యాపారులు పర్యటనలు చేయాల్సి వస్తుంది. మీ ఆలోచనలో మార్పులు అవసరం. నూతన పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.  నూతన వాహనం కొనుగోలు చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది


సింహ రాశి


ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళిక ప్రకారం పనులన్నీ పూర్తిచేసేందుకు ప్రయత్నించండి వాయిదా వేయొద్దు. వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.  మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.   


కన్యా రాశి


ఈ రాశివారు ఈ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై తక్కువ ఆసక్తి ఉంటుంది. మిత్రులతో మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది మాటతూలొద్దు. మీరో లోపాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించేందుకు ప్రయత్నించండి. 


 Also Read: ఆగష్టులో రాశిమారుతున్న బుధుడు, శుక్రుడు, కుజుడు, సూర్యుడు.. ఈ 4 రాశులవారికి సంపద, సంతోషం పెరుగుతుంది!


తులా రాశి


ఈ రోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. కష్టపడి పని చేస్తే అర్థవంతమైన ఫలితాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ప్రేమికులు పెళ్లి విషయంలో సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటారు


వృశ్చిక రాశి


వృశ్చిక రాశి  వారు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. ఆత్మీయులతో  ఉండే   విభేదాలు పరిష్కారమవుతాయి. మీరు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.


ధనుస్సు రాశి


ఈ రోజు బయటకు వెళ్లాలి అనుకుంటే ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.  ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. బాధ్యతలు సంపూర్ణంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ జీవితం బావుంటుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ పరిష్కారం అయిపోతాయి


Also Read: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!


మకర రాశి


మీ శక్తిని సరైన దిశలో మళ్లించండి. వ్యాపారంలో పెద్ద పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెందుతారు. వ్యాపార పర్యటనలకు అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేస్తారు.  


కుంభ రాశి


ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు . విద్యార్థులు పనికిరాని విషయాలపట్ల ఆసక్తి తగ్గించుకోవాలి. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 


శని వారం 


మీన రాశి వారికి ఈ రోజు శ్రమ పెరుగుతుంది కానీ దాన్నుంచి సానుకూల ఫలితాలు పొందుతారు. ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలం. సహోద్యోగుల పట్ల మీ ప్రవర్తన మెరుగుపర్చుకోవాలి.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.