లగ్జరీ అండ్ కాస్ట్లీ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు బలమైన సెక్యూరిటీతో కలగలిపిన టాప్ ఫీచర్స్ ఉన్న సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లు, మ్యాక్బుక్లు, వాచెస్, లాప్టాప్లను తమ యూజర్స్‌కు అందిస్తుంటుంది. అయితే తాజాగా భారతీయ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది యాపిల్. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉపయోగపడేలా దీన్ని రూపొందించింది.
అదేంటంటే? - యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్ అనే ఫీచర్‌ను లాంఛ్ చేసింది. దీంతో పిల్లల దగ్గర స్మార్ట్‌ఫోన్ లేకపోయినప్పటికీ వారు యాపిల్ వాచ్ ద్వారా కాల్స్, మెసేజెస్ చేయొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పిల్లల ప్రతీ యాక్టివిటీని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లల హెల్త్, ఫిట్నెస్ డేటాతో పాటు ఇతర సేఫీ ఫీచర్స్‌ను తల్లిదండ్రులు ట్రాక్ చేయొచ్చు.
ఇంకా ఏమి ఉపయోగాలు ఉన్నాయంటే? - ఈ యాపిల్ కిడ్స్ ఫీచర్‌ను వాచ్‌లో యాక్టివేట్ చేయగానే తద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల వాచ్‌ను పూర్తిస్థాయి కంట్రోల్లో తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పిల్లల యాక్టివిటినీ తెలుసుకుంటూ వారిని కంట్రోల్ చేయడం అన్నమాట. ఈ ఫీచర్ యాక్టివేట్ ద్వారా యాపిల్ వాచ్ వాడే పిల్లలు ఎప్పుడు తమ ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్‌తో కనెక్ట్‌లో ఉండొచ్చు. యాపిల్ మ్యాప్స్, హెల్త్, సిరి వంటి ఫీచర్లను వినియోగించుకోవచ్చు.
ఇంకా ఎమర్జెన్సీ సిట్యూయేషన్లో ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఈ వాచ్‌ను ఉపయోగించుకుని పిల్లలు తమ పేరెంట్స్‌కు తమ లొకేషన్లను కూడా షేర్ చేసేలా వెసులుబాటును కల్పించింది యాపిల్. వారు ఏదైనా కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ చేయాలనుకున్నా, కొత్త కాంటాక్టులను యాడ్ చేసుకోవాలన్నా.. తల్లిదండ్రులు లేదా ఎవరితోనైతే కనెక్ట్ అవుతామో వారి అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సిందే. అలా పిల్లల ప్రతి యాక్టివిటీని ఇందులో ట్రాక్ చేయొచ్చు.
అలాగే తమ ఐఫోన్ ద్వారానే టాస్కులను, షెడ్యూళ్లను, రిమైండర్లను కూడా ఈ వాచ్లకు సెట్ చేయొచ్చు. ఇంకా స్కూల్ టైమింగ్స్‌లో పిల్లలు యాప్స్ లేదా ఇతర ఏమైనా వాటిని యాక్సెస్ చేయకుండా ఉండేలా స్కూల్‌మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా ఇది అటు పిల్లలకు, ఇటు తల్లిదండ్రులకు ఎంతగానే ఉపయోగపడుతుంది.
ఈ ఫీచర్‌ను ఎలాంటి మోడళ్లలో ఉపయోగించాలంటే? - ఈ యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్ ఫీచర్‌ను కేవలం యాపిల్ వాచ్ ఎస్‌ఈ సిరీస్, లేదా యాపిల్ వాచ్ సిరీస్ 4,
లేదా ఆపై మోడళ్లలో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఓఎస్ 7 లేదా ఐఫోన్ 14, లేదా ఆపై ఓఎస్‌లతో నడిచే ఐఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. దీని కోసం సెల్యూలర్ ప్లాన్ ఉన్న యాపిల్ వాచ్ అవసరం. ఈ ఫీచర్‌ను వినియోగించడం వల్ల యాపిల్ వాచ్ సింగిల్ ఛార్జ్‌తో 14 గంటల వరకు పని చేస్తుంది.