Daily Horoscope for April 5th 2024: 


మేష రాశి


ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న వివాదాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.


వృషభ రాశి


ఈరోజు ఈ రాశి వారికి చేపట్టిన పనులు నిదానంగా జరుగుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. అకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో వివాదాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు.


మిథున రాశి


ఈ రోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనారోగ్య సూచనలున్నాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కలిసిరావు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.


కర్కాటక రాశి


ఈ రాశి వారికి ఈరోజు భూ సమస్యలు కొంతమేర పరిష్కారం అవుతాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో మంచి వాతావరణం నెలకొటుంది. ఉద్యోగస్తులు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.


సింహ రాశి


ఈ రాశి వారు ఈరోజు ప్రారంభించిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది.


కన్య రాశి


ఈ రాశి వారు ఇవాళ బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మరింత కలిసి వస్తాయి.


తులా రాశి


ఈ రాశి వారు ఇవాళ ఆనారోగ్య సమస్యల  నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు  నిర్ణయాలు తీసుకోరాదు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.


 వృశ్చిక రాశి


ఈ రాశి వారికి ఇవాళ అన్ని రకాల పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మరింత జాగ్రత్తగా మెలగాలి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.


ధనస్సు రాశి


ఈ రాశి వారికి ఈరోజు మానసిక సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయం వల్ల పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు బెడిసి కొడతాయి. ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి.


మకర రాశి


ఈరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. పనులలో జాప్యం జరుగుతుంది.


కుంభ రాశి


ఈరోజు ఈ రాశి వారికి దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంది.


మీన రాశి


ఈరాశి వారికి  ఈరోజు చెయ్యని తప్పుకు నిందలు పడతారు. పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో చికాకులు తప్పవు. అధికంగా ఖర్చులు అవుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ALSO READ: ఇండియాలోనే కాదు, ఈ దేశాల్లో కూడా శక్తిపీఠాలు ఉన్నాయ్, అదెలా సాధ్యం అనుకుంటున్నారా?