Surya Grahan 2024 Negative Effect: గ్రహణాలను హిందూమతంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజు చంద్రగ్రహణం, అమావాస్య రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణ ప్రారంభానికి 12 గంటల ముందే సూతకాలం ప్రారంభం అవుతుంది. చంద్రుడు - సూర్యుడు - భూమి ఎదురెదురుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఎందుకంటే భారతకాలమానం ప్రకారం అక్టోబరు 02 బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మొదలై తెల్లవారు జామున మూడున్నర సమయానికి ముగుస్తుంది. అందుకే మన దేశంలో ఎక్కడా సూర్యగ్రహణం కనిపించదు..ఫలితంగా సూతకాలం, గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అమెరికా, ఫోర్చుగల్, పసిఫిక్ మహాసముద్రం, ఈజిప్టు, రొమేనియా, ఇటలీ, జర్మనీ, అర్జెంటీనా, దక్షిణ అమెరికా సహా పలు దేశాల్లో గ్రహణం చూడొచ్చు.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
ఈ సూర్య గ్రహణం నాలుగు రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపించనుంది...ఆ రాశుల్లో మీరున్నారా?
మేష రాశి
ఈ ఏడాది చివరి సూర్య గ్రహణం మేషరాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఇస్తోంది. ప్రేమికుల మధ్య తగాదాలుంటాయి. పెళ్లిచేసుకోవాలనే ఆలోచన ఉన్నవారు కొన్ని రోజుల పాటూ ఆ ప్రయత్నం విరమించుకోవడం మంచిది. ఉద్యోగులు ఒత్తిడి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ప్రస్తుత సమయంలో పెట్టకపోవడమే మంచిది.
మిథున రాశి
సూర్య గ్రహణ ప్రతికూల ప్రభావం మిథున రాశివారిపై ఉంటు్ంది. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల సలహాలు ఆధారంగా పెద్దగా పెట్టుబడులు పెట్టొద్దు. మీ కోపాన్ని, మీ ప్రవర్తను నియంత్రించండి.
Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!
కర్కాటక రాశి
కర్కాటక రాశివారిపై సూర్యగ్రహణ ప్రభావం ఆర్థికంగా చూపిస్తుంది. సమయానికి చేతికి డబ్బు అందదు. అనుకోని ఖర్చులుంటాయి. ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పవు. అనవసర ఖర్చులు అదుపుచేయాల్సిన సమయం ఇది. అప్పులు చేయవద్దు. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
సింహ రాశి
మీ రాశికి అధిపతి సూర్యుడు..అందుకే సూర్య గ్రహణ ప్రభావం మీ రాశిపై అననుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి. మానసికంగా కుంగిపోతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..నూతన పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వాయిదా వేయండి.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
చంద్రగ్రహణం కన్నా సూర్య గ్రహణం పవర్ ఫుల్ అని నమ్ముతారు...సూర్య గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే చంద్రగ్రహణం కన్నా సూర్య గ్రహణం సూతకాలం ఎక్కువ సమయం ఉంటుంది. సూతకాలం ప్రారంభం అయిన తర్వాత ఎలాంటి పూజలు చేయరు. దేవతా విగ్రహాలను ముట్టుకోరు. ఆలయాలు మూసివేసేది కూడా ఇందుకే. అయితే గ్రహణం మనదేశంలో కనిపించనప్పుడు సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.