Daily Horoscope for 26 September 2024
మేష రాశి
మేష రాశి వివాదాలకు రాకుండా ఉండడం మంచిది. ఏదైనా పని గురించి ఆందోళన చెందుతున్నట్టైతే దాన్నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. పనిలో బాధ్యతలు పెరుగుతాయి...అదే సమయంలో మీపై విశ్వసనీయత, గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీపై ఉంటుంది
వృషభ రాశి
ఈ రాశికిచెందినవారు పోటీ పరీక్షలు రాసిఉంటే ఈ రోజు మంచి ఫలితాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. మీ గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు ఈ రోజు మంచిది. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం, ఉద్యోగ జీవతం సంతోషంగా ఉంటుంది
మిథున రాశి
ఈ రోజు మీకు అంత మంచి ఫలితాలను ఇవ్వదు. తొందరపాటుతో కొన్ని తప్పులు చేస్తారు. ఉద్యోగులు కార్యాలయ పనిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నూతనవాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
కర్కాటక రాశి
ఈ రోజు చేపట్టే పని విషయంలో ఆచితూచి అడుగువేయండి. అప్పులు చేసే ఆలోచన విరమించుకోవడం మంచిది. బంధువు లేదా సన్నిహితుల నుంచి ఓ శుభవార్త వింటారు. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
సింహ రాశి
ఈ రాశివారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతన లావాదేవీలు ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది. మీ వ్యాపారంలో ఎవరినైనా భాగస్వామిని చేస్తే..వారి నుంచి మీకు మంచే జరుగుతుంది. మీ పురోగతిలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు.
కన్యా రాశి
ఆదాయ వనరులపై ఈ రోజు మీరు శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు పెద్ద ఒప్పందం వచ్చినట్టే వచ్చి వెనక్కుపోయే అవకాశం ఉంది. విద్యార్థులుకు చదువుపట్ల ఆందోళన పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. ఉద్యోగులు పనిపట్ల నిర్లక్ష్యం వహించవద్దు.
Also Read: ఈ ప్రాంతాల్లో దసరా సెలబ్రేషన్స్ అదిరిపోతాయ్..మీరు వెళ్లారా ఒక్కసారైనా!
తులా రాశి
తులా రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నూతన ఆస్తులు కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. పిల్లల చదువులకు సంబంధించిన ఆందోళన వెంటాడితే వారికి సమయం కేటాయించండి. పాత లావాదేవీలు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
వృశ్చిక రాశి
చేపట్టిన పనులు పూర్తవుతాయి. కొత్తగా పరిచయం అయిన వ్యక్తులకు కొంత దూరం పాటించడం మంచిది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్థిక సంబంధిత విషయాలు ముందుకు సాగుతాయి. ఆదాయం బాగానే ఉంటుంది.
ధనుస్సు రాశి
న్యాయపరమైన విషయాలలో ఈ రోజు మీకు మంచి జరగబోతోంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో ఏదైనా సమస్య గురించి చర్చిస్తే కాస్త ఓపికగా వ్యవహరించండి. పూర్వీకుల ఆస్తులు కలిసొస్తాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించండి
మకర రాశి
ఉన్నత విద్యకు దారులు సుగమం అవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోభివృద్ధి ఉంటుంది. దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది.
Also Read: బతుకమ్మ పండుగ డేట్స్ 2024 ...ఈ రోజు ఏ బతుకమ్మని పూజించాలి!
కుంభ రాశి
గత కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించండి. మీ మాటలో సౌమ్యత మీకు కొత్త స్నేహితులను అందిస్తుంది. రాజకీయ నాయకులకు మద్దతు పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి పొందుతారు.
మీన రాశి
ఈ రాశివారు ఈ రోజు తమ పని గురించి కొంత ఆందోళన చెందుతారు. మనసులో నెలకొన్న గందరగోళం తొలగిపోతుంది. కుటుంబంలో సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. ఎవరికైనా వాగ్ధానం చేసేముందు ఓసారి ఆలోచించండి.
Also Read: ఆశ్వయుజ మాసం ప్రారంభ - ముగింపు తేదీలు.. కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.