Ashwayuja Masam 2024 Start and End Dates:  తెలుగు నెలల్లో ఒకటైన ఆశ్వయుజ మాసాన్ని శక్తిమాసం, కన్యామాసం  అని పిలుస్తారు. సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి ఈ నెలలో విశేష పూజలందుకుంటుంది..ఈ నెలకున్న విశిష్టత ఏంటంటే..


ఆశ్వయుజమాసం ప్రారంభం నుంచి వెన్నెల తెల్లటి పూలలా వెలుగునిస్తుంది. మేఘాలు దూదిపింజల్లా కనిపిస్తాయి..ప్రకృతి మొత్తం పచ్చదనం నిండి ఉంటుంది. అందమైన , ఆహ్లాదకరమైన ఈ రుతువులో వచ్చే శరన్నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్కతిలో విలక్షణమైనవి. 


కాలాన్ని స్త్రీ పురుష రూపాత్మకం అంటారు.. ఏడాదిలో మొదటి ఆరు నెలలు పురుష రూపాత్మకం ( చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం) 


ఏడాదిలో ద్వితీయంలో వచ్చే ఆరు నెలలు స్త్రీ రూపాత్మకం (ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం)..ఈ భాగంలో తొలి నెల ఆశ్వయుజం..అందుకే అమ్మవారి ఉపాసనకు చాలా ప్రత్యేకం


Also Read: తిథి తెలియకపోతే పితృదేవతలకు శ్రాద్ధం ఎప్పుడు పెట్టాలి - పితృపక్షం మిస్సైతే మరో ఆప్షన్ ఇదే!
 
శక్తిమాసంగా పిలిచే ఆశ్వయుజం...తెలుగు సంవత్సరంలో మొదటి నెల అవాల్సింది..కానీ..చాంద్రమానం ప్రకారం చైత్రం మొదటిది అయింది. 


అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకూ మొత్తం  27 నక్షత్రాల్లో మొదటి 13, చినరి 13 నక్షత్రాలను వదిలేస్తే...మధ్యలో ఉండే 14 వ నక్షత్రం చిత్త. ఈ నక్షత్రంలో పున్నమి చంద్రుడు కనిపించే నెల చైత్రం కావడంతో..ఇది మొదటి నెల అయింది. కానీ అమ్మవారి ఉపాసనకు ఆశ్వయుజం మొదటి నెల అవుతుంది. 
 
భగవంతుడిని చేరుకునేందుకు అసలైన మార్గం మొదలయ్యేది ఆశ్వయుజం నంచే. నెల ప్రారంభంలో శారదా నవరాత్రులు పేరుతో 9 రోజులు ఉపాసన చేస్తారు. ఈనెల ఆరంభంలో ఉండే 9 రాత్రులు కలిపితే దేవతలకు తెల్లవారుఝామున అని అర్థం..


దేవతలకు ఏడాదిని ఓ రోజుగా చెబుతారు. సూర్యోదయానికి ముందు వచ్చే సమయాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారం. దేవతలకు బ్రహ్మముహూర్త సమయమే ఆశ్వయుజంలో వచ్చే మొదటి తొమ్మిదిరోజుల సమయం. నెల ఆరంభంలో 9 రాత్రులు కలపి ఒక రోజు ప్రారంభంలో ఉండే తెల్లవారు ఝాముతో సమానం. అందుకే శరన్నవరాత్రులు ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం అని చెబుతున్నాయి పురాణాలు.


Also Read: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ తేదీలు 2024.. ఏ రోజు ఏ వాహన సేవలు - వాటి విశిష్టతలేంటి!


బ్రహ్మముహూర్తం ఎంత విశిష్టమైనదో హిందూ ధర్మంలో ఉంది
 
వర్ణా కీర్తి మతిం లక్ష్మీ స్వాస్త్యమాయుశ్ఛ విదంతి|
బ్రహ్మ ముహూర్తే సంజాగ్రచ్ఛివ పంకజ యథా||


ఈ శ్లోకం అర్థం ...బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే అందం, జ్ఞానం, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఈ  ముహూర్తంతోనే  ప్రకృతికి లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలో పక్షులు, జంతవులు మేల్కొంటాయి. కమలం వికసించేది ఈ సమయంలోనే. ప్రకృతి మొత్తం ఈ సమయంలో చైతన్యం అవుతుంది. అందుకే బ్రహ్మముహూర్తంగా భావించే ఆశ్వయుజమాసం ఉపాసనకు అత్యుత్తమం.  అందుకే శరన్నవరాత్రులు  అంత శక్తివంతమైనవి. ఈ నవరాత్రుల్లో దైవచింతనలో ఉండాలి.


ఈ ఏడాది శరన్నవరాత్రులు అక్టోబరు 03 నుంచి ప్రారంభమవుతున్నాయి....అక్టోబరు 12 విజయదశమి తో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారు తొమ్మిది అలంకారాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది...


Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!