Mahalaya Amavasya 2024:  పితృ పక్షం ప్రారంభమైంది. ఈ 15 రోజులు పూర్వీకులకు తర్పణాలు విడుస్తారు. వారు మరణించిన తిథులు తెలిస్తే ఆయా తిథుల్లో...లేదంటే...పితృపక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు పాటించవచ్చు. అందుకే ఈ రోజుని సర్వపితృ అమావాస్య అంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 18 న మొదలైన పితృపక్షం అక్టోబరు 02 మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. 


మహాలయ అమావాస్య రోజు శ్రాద్ధ కర్మలు పాటించలేకపోతే... ఏడాదిలో ఈ నియమాలు పాటించేందుకు మరికొన్ని రోజులున్నాయి. అవేంటి? పితృదేవతలను సులభంగా ప్రశన్నం చేసుకునేందుకు ఏం పాటించాలో తెలుసుకుందాం..


Also Read:  దసరా సెలవులలో మీ పిల్లలకు ఇవి నేర్పించండి!


శ్రాద్ధం పెట్టడం 


పెద్దలు చనిపోయిన తిథిలో తద్దినం పెట్టాలి. మీకు తిథి తెలియకపోతే తేదీ, సంవత్సరం ఆధారంగా తిథి తెలుసుకోవచ్చు. తిథి, డేట్ రెండూ తెలియకపోతే పితృపక్షంలో మహాలయ అమావాస్య రోజు వారికి శ్రాద్ధం పెట్టొచ్చు. పితృదేవతలకు అత్యంత పవిత్రమైన రోజు ఇది. ఆరోజు పితృదేవతలకు తర్పణాలు విడిచి..వంట చేసి..బ్రాహ్మణుడిని పిలిచి భోజనం పెట్టాలి. స్వయంపాకం అయినా ఇవ్వొచ్చు. ఏడాదికి ఓ రోజు కచ్చితంగా శ్రార్థం పెట్టి తీరాలి. చనిపోయిన పెద్దలు మీకు నచ్చకపోయినా కానీ ఈ కార్యం నిర్వర్తించాలి...వంశాభివృద్ధి, ఐశ్వర్యం లభిస్తుంది.  కొందరు మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరిస్తే..మరికొందరు సంక్రాంతి , శివరాత్రి సమయంలో ఈ నియమం పాటిస్తారు. మీ వంశాచారం ఆధారంగా మీరు అనుసరించండి..కానీ పితృదేవతలను సంతృప్తి పరచడంలో నిర్లక్ష్యం వద్దు. 


Also Read: దసరాకి కాశీ వెళితే చాలు.. మొత్తం 9 మంది అమ్మవార్లను దర్శించుకోవచ్చు!


అమావాస్యకి తర్పణాలివ్వండి


ప్రతి అమావాస్య రోజు మధ్యాహ్నం ( అపరాన్నవేళ) తర్పణాలు విడిచిపెట్టండి. మూడుసార్లు దోసిట్లోకి నీళ్లు తీసుకుని పెద్దలను తలుచుకుని వసువులు, రుద్రులు, పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు విడవండి


భీష్మ తర్పణం


మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి..ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ రోజునే  భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున భీష్ముడిని స్మరిస్తూ తర్పణ౦ ఇవ్వడ౦ స౦ప్రదాయ౦. భీష్మ పితామహుడు మోక్షప్రాప్తిని పొందిన ఈ పర్వదినంలో రోజు తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. 


దీపావళి రోజు దివ్వె కొట్టండి


దీపావలి రోజు సాయంత్రం దివ్వె కొట్టే సంప్రదాయం కొందరికి ఉంటుంది. ఈ రోజు గోంగూర కాడ కానీ ఆముదం మొక్క కాడ కానీ తీసుకుని ఒత్తులు చుట్టి వెలిగించి దుబ్బు దుబ్బు దీపావళి అని కొట్టి దక్షిణం వైపు పడేస్తారు. ఎందుకంటే దీపావళి రోజు ప్రదోషసమయంలో వసురుద్రులు సంచారానికి వస్తారట. కొన్ని సంప్రదాయాలు పాటిస్తున్నామని పితృదేవతలకు చెప్పడమే దీనివెనుకున్న ఆంతర్యం..


Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!


పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం


పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే పితృదేవతల రుణం తీరుతుంది. సృష్టి నడవాలి అంటే కామం ఉండాలి...ఇందులో భాగంగా ఏర్పాటు చేసినదే వివాహం. పిల్లల్ని కనం..కుక్కని పెంచుకుంటాం అంటుంటారు... పెంచుకోండి కానీ..కుక్కని పెంచేవారు పిల్లల్ని పెంచుకోలేరా ఆలోచించండి..


గయలో తద్దినం పెడితే మళ్లీ పెట్టక్కర్లేదు అంటుంటారు..నిజమే..గయలో భక్తితో తర్పణం విడిచి, పిండం పెడితే ఆ జీవుడు తృప్తిగా వెళ్లిపోతాడని చెబుతారు. కానీ సంవత్సరానికి ఓసారి పితృదేవతలను స్మరించుకోవడం వల్ల మీకు, మీ కుటుంబానికి మంచి మాత్రమే జరుగుతుంది..