Durga Devi Slokas for Navarathri:  దసరా నవరాత్రుల సంబరాల సందడి మొదలవుతోంది. అమ్మవారి ఆలయాల్లో రోజుకో అలంకారంలో శక్తి స్వరూపిణి భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయాలకు వెళ్లేవారు వెళతారు..ఇంట్లో పూజలు చేసుకునేవారు భక్తి శ్రద్ధలతో తన శక్తి కొలది పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. పెద్దలు, భక్తుల సందడి సరే..మరి పిల్లలకో అంటే.


దసరా సెలవుల సందర్భంగా పిల్లలకు ఈ శ్లోకం నేర్పించండి. అత్యంత పవర్ ఫుల్ అయిన ఈ పద్యాన్ని దుర్గాదేవిని స్తుతిస్తూ బమ్మెర పోతన చెప్పారు. 


'అమ్మలగన్నయమ్మ' అనే పద్యం  మీరంతా వినే ఉంటారు.. కానీ ఆ పద్యం వెనుక ఎంతటి మహత్తు ఉందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. వెంటనే నేర్చుకుంటారు..


"అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"


బమ్మెర పోతన రాసిన ఈ పద్యాన్ని తెలిసో తెలియకో చదివినా చాలు..మీరు ఊహించనంత అద్భుత ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే కొన్ని శ్లోకాలు , పద్యాలను గురు సమక్షంలోనే చదవాలి కానీ మీకు మీరుగా నేర్చుకోకూడదు. మరీ ముఖ్యంగా అమ్మవారి పూజలు, శ్లోకాలు, స్తోత్రాల విషయంలో ఈ నియమం తప్పనిసరి. ఎందుకంటే అమ్మవారి శ్లోకాల్లో ఎక్కువగా బీజాక్షరాలుంటాయి..వాటిని స్పష్టంగా పలకకపోతే దానివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ ఉంటుంది. అందుకే శక్తి స్వరూపిణి పూజల్లో ఇలాంటి రిస్క్ చేయకూదు. 


Also Read: ఆయుధ పూజ దసరా సమయంలోనే ఎందుకు చేస్తారు!


అయితే అమ్మవారిని ధ్యానించేందుకు బమ్మెర పోతన ఇచ్చిన గొప్ప కానుక ఇది


అమ్మగన్నయమ్మ పద్యంలో అమ్మలను కన్న దేవతా స్త్రీలైన వారి మనస్సులో ఏ అమ్మవారు ఉన్నదో..అలాంటి అమ్మని మహత్వ,  కవిత్వ, పటుత్వ, సంపదల్...ఈ నాలుగింటిని ఇవ్వమని నమస్కరిస్తున్నాను..ఆ దుర్గమ్మే మాయమ్మ అని అర్థం. 
లలితా సహస్రనామం...శ్రీ మాతా అని ప్రారంభమవుతుంది
శ్రీ మాతా అంటే  'శ' కార, 'ర' కార, 'ఈ' కారాలతో కూడిన  సత్వ, రజో, స్తమో..గుణాధీశులైన శక్తి అని అర్థం
బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి...సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, ఈ ముగ్గురికీ అమ్మ..ఈ శక్తులను త్రిమూర్తులకు ఇచ్చిన పెద్దమ్మే  'లలితాపరాభట్టారికా' స్వరూపం
లలితా దేవికి దుర్గాదేవి స్వరూపానికి బేధం లేదు..


Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!


ముగ్గురమ్మల మూలపుటమ్మ
మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి ముగ్గురు కలసిన రూపం..


చాలా పెద్దమ్మ
బ్రహ్మాండం అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం.. చిన్నా పెద్దా అనే బేధం లేకుండా సమస్త జీవులలో నిండిపోయినది అని అర్థం. అదే మాతృత్వం...


సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ
దేవతలకు శత్రువైన  రాక్షసుల అమ్మకు కడుపుశోకం మిగిల్చిన తల్లి ...రాక్షసులు నశించేందుకు కారణం అయిన తల్లి...
 
తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి అమ్మ


అష్టమాతృకలు అని చెప్పే...బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి , వారాహి, మహాలక్ష్మి ,చాముండి, కౌమారి. వీరంతా శ్రీ చక్రం దేవతలుగా నిత్యం అమ్మవారిని కొలుస్తుంటారు..వీళ్లందరి ఆరాధన అందుకునే అమ్మవారే దుర్గమ్మ...ఆ దుర్మమ్మే నాకు దయతో మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలు ఇవ్వాలి.


Also Read:  అజాన్..నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి!


అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అనే బీజాక్షరాలున్నాయి
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్...ఈ బీజాక్షరాలను ఎలా అంటే అలా పలకకూడదు..అందుకే వీటికి బదులుగా బమ్మెర పోతన ఇలా చెప్పారు..
 
మహత్వానికి బీజాక్షరం 'ఓం'
కవిత్వానికి  బీజాక్షరం'ఐం'
పటుత్వానికి  బీజాక్షరం ' హ్రీం'
సంపదల్ కి బీజాక్షంర 'శ్రీం'
ఓం, ఐం, హ్రీం, శ్రీం, అమ్మలగన్నయమ్మ 


ఓం శ్రీమాత్రేనమః
 
ఈ పద్యాన్ని పిల్లలకు నేర్పిస్తే చాలు..వారి ఆరోగ్యం, ఆయుష్షు, విద్య అన్నీ అమ్మవారే ప్రసాదిస్తుందని చెబుతారు.. 


Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!