Sun Transit in Cancer 2024: జూలై 16 నుంచి నెలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నింటా విజయం!

Surya Gochar 2024: సూర్యుడు జూలై 16న కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో ఆదిత్యుడి ప్రవేశం ఈ రాశులవారికి మహారాజయోగాన్నిస్తుంది...

Continues below advertisement

Surya Gochar 2024 Sun Transit in Cancer: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడి స్థానం చాలా ప్రత్యేకం. గ్రహాలకు రాజైన సూర్యుడు నెలకో రాశి నుంచి పరివర్తనం చెందుతాడు. అలా రాశి మారిన ప్రతిసారీ నెలకో సంక్రమణం వస్తుంది. వీటిలో మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి చాలా ప్రత్యేకం. మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభమైతే...కర్కాటక సంక్రాంతి నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. సూర్య భగవానుడి సంచార ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. ఆదిత్యుడి సంచారం  శుభప్రదంగా ఉంటే ఆ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. ప్రస్తుతం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సూర్య సంచారం వల్ల ఈ నాలుగు రాశులవారికి మహారాజయోగం ఉండబోతోంది... ఏంటా రాశులు? ఇందులు మీ రాశి ఉందా?  

Continues below advertisement

Also Read: మేషం, కన్యా, కుంభం, మీనం సహా ఈ 7 రాశులవారికి జూలై నెలంతా దశ తిరిగిపోతుంది!

మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

కర్కాటక రాశిలో సూర్యభగవానుడి ప్రవేశం మేష రాశివారికి అద్భుతమైన ఫలితాలనిస్తోంది. ఆదాయవనరులు పెరుగుతాయి. ఏ పని ప్రారంభించినా కలిసొస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసిఉంటే మంచి ఫలితాలు పొందుతారు. ఈ నెలరోజులూ సంతోషంగా గడిచిపోతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

సూర్యుడి రాశిపరివర్తనం వృషభ రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. గత కొన్నాళ్లుగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు...సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తిస్తారు. ఏ పని తలపెట్టినా ఊహించని స్థాయిలో లాభాలు పొందుతారు. కుటుంబం నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. 

Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!

మిధునరాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

కర్కాటక రాశిలో సూర్యుడి రాశి పరివర్తనం మిథునరాశివారి కుటుంబంలో సంతోషం వెల్లివిరిసేలా చేస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఇది చాలా కలిసొచ్చే సమయం. ఆర్థికపరిస్థితి బలోపేతం అవుతుంది. 

సింహరాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సూర్యుడి రాశి పరివర్తనం సింహరాశివారి జీవితంలో కొత్తవెలుగులు నింపుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఊహించని స్థాయిలో వృద్ధి ఉంటుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వాహనయోగం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నెల రోజుల పాటూ సంతోషం మీ సొంతం. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు..

Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?

Note:ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

Also Read: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసోత్సవాలు ..నెలరోజుల పాటూ దుర్గమ్మ సన్నిధిలో పండుగ వాతావరణమే!

Continues below advertisement