Sun Transit 2024 Surya Rashi Parivartan Horoscope: నవగ్రహాలు నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తూ ఉంటాయి. ఏ గ్రహం రాశిమారినా ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది. కొందరికి అనుకూల ఫలితాలుంటే మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఒక్కో రాశిలో సంచరించే సూర్యుడు..మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఈ సంచారం కొన్ని రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు అందిస్తోంది. 


మేష రాశి (Aries)


మకర సంక్రాంతి నుంచి మేషరాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పురోభివృద్ధి పొందుతారు.  
ఏ పని ప్రారంభించినా కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి తగిన మద్దతు లభిస్తుంది. ఉన్నత బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. వ్యాపారంలో తక్షణ విజయంతో లాభాలను పొందుతారు. ప్రేమ జీవితం బావుంటుంది. అవివాహితులకు వివాహం జరిగే సూచనలున్నాయి...


Also Read:  మకర సంక్రాంతి ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగులు నింపుతోంది, జనవరి 15 రాశిఫలాలు


మిథున రాశి (Gemini)


మకర రాశిలో సూర్య సంచారం మిథున రాశివారికి కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. పిల్లల కారణంగా సంతోషం పెరుగుతుంది. మనసులో ప్రశాంతత, సంతోషం  ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది.


సింహ రాశి (Leo)


సింహ రాశివారి కెరీర్ సంక్రాంతి నుంచి మరింత బావుంటుంది. కెరీర్లో మంచి విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కుటుంబ పెద్దల నుంచి మీకు సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్  చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి..


Also Read: మకర సంక్రాంతి శుభాకాంక్షలు - మీ బంధుమిత్రులకు చెప్పేయండిలా!


కన్యా రాశి (Virgo)


మకర రాశిలో సూర్యుడి ప్రవేశం కన్యారాశివారి ప్రశాంతతని ఇస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు శుభసమయం. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. కెరీర్ మరింత బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది


ధనస్సు రాశి (Sagittarius)


మకర సంక్రాంతి నుంచి సూర్య సంచారం ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఆర్థికపరిస్థితి మీరు ఊహించనంతగా మెరుగుపడుతుంది. దాంపత్య సంతోషం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో గౌరవం ఉంటుంది. విద్యార్థులుకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 


Also Read: సంక్రాంతి వచ్చేస్తోంది - మీకు పట్టిన శనిని ఇలా వదిలించేసుకోండి!


మీన రాశి  (Pisces)
 
సూర్యుడి రాశిమార్పు మీనరాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. మకర సంక్రాంతి రోజు నుంచి మీ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి. ఇప్పటి వరకూ ఎదుర్కొన్న కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కెరీర్లో మీకిది ప్రత్యేకమైన సమయం..ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. మీ జీవితంలో ఊహించనన్ని మంచి విషయాలు జరుగుతాయి. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.