Parenting tips for active children on leave : ఆదివారం దాదాపు పేరెంట్స్, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఆ సమయంలో చాలా మంది రెస్ట్​ తీసుకోవడానికి చూస్తుంటారు. మళ్లీ సోమవారం వస్తే ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు, పేరెంట్స్ మధ్య చనువు తగ్గిపోతుంది. పిల్లలు కూడా డల్​గా ఉంటారు. కాబట్టి మీకున్న కొద్ది సమయంలోనే పిల్లలని యాక్టివ్​గా ఉంచుతూ.. వారితో చనువు పెంచుకునేందుకు ఆదివారాన్ని కచ్చితంగా ప్రొడెక్టివ్​గా వినియోగించుకోండి. సండే లేదా సెలవుల రోజుల్లో వారితో ఎలా టైం స్పెండ్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 


సండే థీమ్​..


ఆదివారం పిల్లలు స్కూల్ ఉండదని చాలా బద్ధకంగా ఉంటారు. అలాంటి సమయంలో మీరో సండే థీమ్ పెడితే.. వారికి ఇబ్బంది లేకుండా అది వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వారంతట వారే థీమ్​కి సిద్ధమవుతూ ఉంటారు. ఇది పిల్లల మెదడును యాక్టివ్​గా, క్రియేటివ్​గా ఉండేలా చేస్తుంది. 


పార్క్​..


మీకు దగ్గర్లో పార్క్​ ఉంటే అక్కడికి వారిని తీసుకువెళ్లొచ్చు. వారికి స్వచ్ఛమైన గాలి అక్కడ అందుతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది. అక్కడ వారు ఆడుకునేందుకు కొన్ని గేమ్స్ ఉంటాయి. లేకుంటే వారికి రన్నింగ్ రేస్ పెట్టవచ్చు. వారితో మీరు కూడా కలిసి ఆడుకోవచ్చు. ఇది మీ మధ్య చనువును కూడా బాగా పెంచుతుంది. 


కిచెన్​ గెస్ట్..


సండే రోజు పిల్లలు ఏమి తినాలనుకుంటున్నారో అడగండి. వాటిని మీరు ఇంట్లోనే వండేందుకు ప్రయత్నించండి. ఆ పనిలో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేయండి. వారికి చిన్న చిన్న పనులు చెప్పండి. ఇది కూడా వారి మెదడును యాక్టివ్​గా ఉంచుతుంది. పైగా పిల్లలు వంటగదులను బాగా ఇష్టపడతారు. ఫుడ్ తయారు చేస్తూనే వారితో మీరు కబుర్లు చెప్పవచ్చు కూడా.


ఆర్ట్ 


పిల్లలు చాలా క్రియేటివ్​గా ఉంటారు. వారిలో రకరకాల టాలెంట్స్ ఉంటాయి. చదువుల్లో పడి వాటిని మీరు గుర్తించరు. వారు బయటపడరు కాబట్టి.. వారితో పాటలు పాడించడం, డ్యాన్స్ చేయించడం, గేమ్స్ ఆడించడం, పెయింటింగ్స్, డ్రాయింగ్స్ వంటివి వేయించవచ్చు. ఇవి వారిలో క్రియేటివిటీని పెంచడంతో పాటు.. వారిలోపలి కళలను మీరు ప్రోత్సాహించే వీలు ఉంటుంది. 


క్విజ్ పోటీలు


ఇంట్లో పిల్లలను కొన్ని క్విజ్ క్వశ్చన్స్ అడగవచ్చు. వాటికి జవాబులు చెప్తే ప్రైజ్​లు ఇవ్వొచ్చు. వారు ఆన్సర్స్ ఇవ్వని వాటి గురించి ఇంట్రెస్టింగ్​గా జవాబులు చెప్పవచ్చు. ఇలా చెప్పడం వల్ల వారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఇది వారి బ్రెయిన్​ని యాక్టివ్​గా ఉంచుతుంది. 


పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడమనేది చాలా ముఖ్యమైనది. అది ఎంత వినోదభరితంగా, ఉత్సాహంగా ఉంటే పిల్లలు మానసిక ఆరోగ్యం అంత బాగా ఉంటుంది. వారు యాక్టివ్​గా ఉండేలా, మీతో హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేసేందుకు హెల్ప్ అవుతుంది. వారిలోని సృజనాత్మకతను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తే వారు ఇంకా మెరుగవుతూ ఉంటారు. అంతేకానీ వారిని భయపెట్టి, బలవంతంగా చదివించినా, కంట్రోల్ చేసినా మీరు వారిని పెంచడంలో ఎలాంటి అర్థం ఉండదు. 


Also Read : సండే స్పెషల్ హెల్తీ, టేస్టీ ప్రోటీన్​ రిచ్​ పకోడి.. రెసిపీ చాలా సింపుల్