CSIR UGC NET (December) 2023 Answer Key: దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (JRF) అర్హత కోసం నిర్వహించిన 'జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(CSIR UGC NET) డిసెంబర్‌-2023' ప్రాథమిక కీని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) జనవరి 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతాలుంటే జనవరి 8లోగా తెలియజేయాల్సి ఉంటుంది. 


దేశవ్యాప్తంగా 356 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో జరిగిన పరీక్షలకు మొత్తం 2,19,146 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.


JOINT CSIR-UGC NET ANSWER KEY 


పరీక్ష విధానం ఇలా..


➥ మొత్తం 5 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషియన్, ప్లానెటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులు ఉంటాయి.


➥ ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.


➥'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ 'పార్ట్-బి', 'పార్ట్-సి' విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.


ALSO READ:


గేట్-2024 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్‌‌లోడ్ చేసుకోండి!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 పరీక్ష అడ్మిట్ కార్డులు (GATE Halltickets) విడుదలయ్యాయి. ఐఐఎస్సీ బెంగళూరు (IISC Bengaloru) హాల్‌టికెట్లను జనవరి 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది 8 లక్షలకు పైగా అభ్యర్థులు గేట్‌ రాయనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం  ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను ఫిబ్రవరి 16న, ఆన్సర్ కీని ఫిబ్రవరి 21న విడుదల చేయనున్నారు. అనంతరం ఆన్సర్ కీపై అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు. అభ్యర్థులు మార్చి 23 నుంచి గేట్ స్కోరుకార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గేట్-2024 అడ్మిట్‌కార్డులు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..