Daily Horoscope for 21 August 2024 


మేష రాశి


ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. అప్పులు చేయాల్సి వస్తుంది. కొన్ని కొత్త పనులు ప్రణాళికలో చేర్చుకుంటారు. విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభపడతారు. పిల్లల కారణంగా ఈ రోజు సంతోషంగా ఉంటారు. ఆదాయవనరులపై శ్రద్ధ వహించాలి. 


వృషభ రాశి 


ఈ రోజు మీకు బలహీనమైన రోజు అవుతుంది. ఆర్థిక విషయాలకు సంబంధించి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార వ్యవహారాలపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. 


మిథున రాశి 


ఈ రోజు మీకు సమస్యలతో కూడిన రోజుగా ఉంటుంది. విద్యార్థులు ఏదో ఒక పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాన్ని కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. 


Alos Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!


కర్కాటక రాశి


ఈ రోజు మీకు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. సామాజిక రంగాలలో పని చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి.  చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనిని పూర్తిచేయాల్సి ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ బాధ్యతలపై శ్రద్ధ వహిస్తారు. ఏదైనా విషయంలో తప్పులు చేసి ఉంటే దానిని గుర్తించి సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి. మీ పనితీరుపై యాజమాన్యానికి పూర్తి విశ్వాసం ఉంటుంది. 


సింహ రాశి


మీ మాటలు, ప్రవర్తనను నియంత్రించుకోవాల్సిన సమయం ఇది. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులుంటాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేయాలి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించడం మంచిది. 


కన్యా రాశి


ఈ రోజు మీకు ఆందోళన కలిగించే రోజు అవుతుంది. వ్యాపారంలో ఏదైనా కొత్త ప్రయత్నంలో బిజీగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. అప్పుకోసం ప్రయత్నించేవారికి డబ్బు చేతికందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు సంపూర్ణమ ద్దతు లభిస్తుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహిస్తారు. లావాదేవీలకు సంబంధించిన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి.


తులా రాశి 


ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో మంచి పనితీరు కనబరుస్తారు. మీ గౌరవం  పెరుగుతుంది. మీ అభివృద్ధిని చూసి కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. కొత్తగా పెళ్లయిన వారి జీవితంలోకి కొత్త అతిథి ప్రవేశించవచ్చు. మీరు మీ పాత అప్పులు తీర్చే ప్రయత్నంలో బిజీగా ఉంటారు. అనవసర వాగ్ధానాలు చేయవద్దు. 


Also Read: లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా దక్కాలంటే..తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలా చేయండి!
 
వృశ్చిక రాశి


ఈ రోజు మీకు ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది. తొందరగా అలసిపోయినట్టు భావిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో కొన్ని సమస్యలపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి.   ఆస్తికి సంబంధించిన విషయాలు వివాదం ద్వారా కాకుండా కూర్చును మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునేందగుకు ప్రయత్నించాలి.  


ధనుస్సు రాశి 


ఈ రోజు మీకు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం మంచిది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి పనితీరు కనబరుస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు పెద్దలతో కూర్చుని మాట్లాడాలి. వ్యాపారం బాగానే సాగుతుంది


మకర రాశి


పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే రోజిది. జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవ జరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ పనికి సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణకు ప్రణాళికలు వేసుకుంటారు. ప్రయాణాలలో ముఖ్యమైన సమాచారం వింటారు. 


Also Read: అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం - కామాఖ్యా దేవి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా!


కుంభ రాశి 


ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి లేదంటే నష్టపోతారు. నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటారు. మారుతున్న వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 


మీన రాశి


వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో ఏదైనా పనిని చాలా ఆలోచనాత్మకంగా చేయాల్సి ఉంటుంది లేదంటే నష్టాలు తప్పవు.  మనస్సులో ప్రతికూల ఆలోచనలకు అవకాశం ఇవ్వొద్దు. పిల్లలకు సంబంధించి మిమ్మల్ని వేధిస్తున్న సమస్య ఒకటి దూరమవుతుంది.  


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.