Daily Horoscope for 1 September 2024

మేష రాశి

ఈ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు  ఈరోజు శుభ దినం. పిల్లల భవిష్యత్తుపై ఆందోళన ఉంటుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించండి. వృషభ రాశి

వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ లక్ష్యం పట్ల పూర్తి మక్కువతో పని చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైంది. నూతన ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు మంచిది.  మిథున రాశి

ఈ రోజు మీరు మీ కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలున్నాయి. పరిశోధన రంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు.  అనవసర చర్చలలో పాల్గొనవద్దు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. 

కర్కాటక రాశి

రోజు చాలా ప్రశాంతంగా ప్రారంభమవుతుంది.  ఉద్యోగంలో మీ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు. కుటుంబానికి తగిన సమయం కేటాయించాలి. మీ మనోబలం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీరు సానుకూలంగా భావిస్తారు.

Also Read: పరిపూర్ణమైన జగత్తుకి సంకేతంగా చెప్పే వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!

సింహ రాశి

ఈ రోజు మంచి రోజు కాదు. ఆర్థిక లావాదేవీల విషయంలో పొరపాట్లు చేయవద్దు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

కన్యా రాశి

రోజంతా చాలా బిజీగా ఉంటారు. మీ గౌరవం  పెరుగుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు. అవివాహితులకు వివాహం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. ఎప్పటినుంచో వెంటాడుతున్న వివాదాలు పరిష్కారం అవుతాయి.  తులా రాశి

చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు. కుటుంబ సభ్యులతో మధ్య సఖ్యత ఉంటుంది. సమయాన్ని వృధా చేయవద్దు. అనవసర వివాదాలు జరిగే సూచనలున్నాయి..మాట తూలకండి.

Also Read: బుద్ధి, జ్ఞానం, ధైర్యం, ఆత్మ విశ్వాసం కోసం ఈ రూపంలో ఉన్న గణపతిని పూజించాలి! వృశ్చిక రాశి

పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు తగ్గించుకోవాలి. 

ధనస్సు రాశి

కెరీర్‌లో చాలా అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇంటి సమస్యలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. అనవసరంగా ఎదుర్కోవాల్సిన ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. 

మకర రాశి

అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనులన్నీ అంతరాయం లేకుండా సాగిపోతాయి. కుటుంబ సభ్యులలో అవివాహితుల వివాహానికి సంబంధించి చర్చలు జరుగుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. 

కుంభ రాశి

ఈ రోజు సమయం మీకు బాగా కలిసొస్తుంది. ఏ పని ప్రారంభించినా సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. నూతన స్నేహితుల సహకారం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Also Read: ఏక సాలగ్రామ శిలపై చెక్కిన గణనాథుడు.. త్రిమూర్తులు ప్రతిష్టించిన విగ్రహం ఇది!

మీన రాశి

ఇంటా బయటా మీ ఆధిపత్యం పెరుగుతుంది. గత పరిచయాల నుంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు విద్యలో మంచి విజయాలు సాధిస్తారు. మీ ఆలోచనలు కుటుంబం సభ్యులతో పంచుకోవడం మంచిది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.