East Godavari Rains: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, తూర్పుగోదావరిలో 22 కంట్రోల్ రూం నెంబర్లు ఏర్పాటు

Rains In AP | ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రజలకు సహాయార్థం 22 కంట్రోల్ రూం నెంబర్లు ఏర్పాటు చేశారు.

Continues below advertisement

Andhra Pradesh Rains | రాజమహేంద్రవరం: వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్పా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పలు జిల్లాల్లో ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలోని మొగల్రాజపురంలో వర్షాలతో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతిచెందగా, గుంటూరు జిల్లాలో వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న టీచర్ తో పాటు ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరోచోట వ్యక్తి గల్లండయ్యాడు. అందిన సమాచారం వరకు శనివారం నాడు ఏపీలో ఎనిమిది మంది మృతిచెందారు. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ పి ప్రశాంతి 22 కంట్రోల్ రూం లు ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  

Continues below advertisement

కంట్రోల్ రూం నెంబర్లు 
జిల్లా కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం 89779 35609

రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయము, రాజమహేంద్రవరం - 08832-442344

సబ్ కలెక్టర్ కార్యాలయము, కొవ్వూరు 08813-231488

తహశీల్దారు కార్యాలయము, రాజమహేంద్రవరం రూరల్ 0883-2416005

తహశీల్దారు కార్యాలయము, రాజమహేంద్రవరం అర్బన్ 94946 62219

తహశీల్దారు కార్యాలయము, సీతానగరం - 62818 67443

తహశీల్దారు కార్యాలయము, కోరుకొండ - 99086 82953

గోకవరం తహశీల్దారు కార్యాలయము - 94923 42353

తహశీల్దారు కార్యాలయము, రాజానగరం - 91826 48034

తహశీల్దారు కార్యాలయము, రంగంపేట - 70952 39456

తహశీల్దారు కార్యాలయము, అనపర్తి - 90006 60657

తహశీల్దారు కార్యాలయము, బిక్కవోలు - 98664 84845

తహశీల్దారు కార్యాలయము, కడియం - 76590 66699

తహశీల్దారు కార్యాలయము, కొవ్వూరు - 79810 29003

తహశీల్దారు కార్యాలయము, తాళ్ళపూడి - 75697 70487

తహశీల్దారు కార్యాలయము, చాగల్లు - 96766 34787

తహశీల్దారు కార్యాలయము, నిడదవోలు - 96762 53740

తహశీల్దారు కార్యాలయము, ఉండ్రాజవరం - 94933 06893

తహశీల్దారు కార్యాలయము, పెరవలి - 98491 72014

తహశీల్దారు కార్యాలయము, గోపాలపురం - 73375 21367

తహశీల్దారు కార్యాలయము, దేవరపల్లి - 97058 18045

తహశీల్దారు కార్యాలయము, నల్లజర్ల - 95051 32306

Also Read: Trains Cancelled: వాయుగుండంతో భారీ వర్షాలు - విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు, దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన 

రాబోయే 3 రోజుల్లో అల్లూరి మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. అటు విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, కోనసీమ, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

Continues below advertisement