Shravan Maas 2023: ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 18 మంగ‌ళ‌వారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శివలింగాన్ని పూజిస్తారు. ఈ కాలంలో పరశివుడి స్వరూపమైన శివలింగానికి జలాభిషేకం, పంచామృత అభిషేకం చేస్తారు. శ్రావణ మాసంలో ఏ శివలింగాన్ని పూజించాలి? శ్రావణ మాసంలో శివలింగాన్ని ఎలా పూజించాలి..?


ఆకాశమే లింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇదే అంతా లయం చెందుతుంది. అందుకే  దీనిని లింగం అని అన్నారు. ‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో కూడా  తెలియజేస్తుంటుంది. అందుకే  అది లింగమైంది. ఈ సృష్టి మొత్తం శివమయం. ఈ సమస్తం ఆయనతోనే నిండి ఉంది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి అంతులేని మహాసముద్రంలా ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని కూడా  సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు.


Also Read : ఈ పనులు చేస్తే ప‌ర‌మ‌శివుడి ఆగ్ర‌హానికి గురవుతార‌ని తెలుసా? శివ పురాణం ఏం చెబుతోందంటే?


1. శివలింగం రకాలు


శివలింగాలలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి


- స్వ‌యంభూ శివలింగం
- మాన‌వ నిర్మిత‌ శివలింగం


2. స్వ‌యంభూ శివలింగం
స్వ‌యంభూ శివలింగం ఉల్క వంటి నల్లని అండాకారంలో ఉంటుంది. ఇది ప‌ర‌మేశ్వ‌రుడే స్వ‌యంగా వివిధ సంద‌ర్భాల్లో లింగ రూపంలో కొలువుదీరిన‌ట్టు చెబుతారు. మ‌న దేశంలో ఈ శివలింగాన్ని జ్యోతిర్లింగం అని పిలుస్తారు.


3. మాన‌వ నిర్మిత లింగం
మానవులు నిర్మించే ఆల‌యాల్లో ప్ర‌తిష్ఠించే శివ‌లింగాలు ఈ త‌ర‌హాలోనికి వ‌స్తాయి. అయితే పాదరసంతో చేసిన శివలింగం విశేష ఫ‌లితాల‌ను ఇస్తుంది. ఈ శివలింగం ప్రాచీన వేద శాస్త్రంపై ఆధారపడి రూపొందిస్తారు.


4. ఇతర శివలింగాలు
ఇంకా, పురాణాల ప్రకారం, శివలింగాలలో 6 ప్రధాన రకాలు ఉన్నాయి. దేవ లింగం, అసుర లింగం, ఆర్ష లింగం, పురాణ లింగం, పార్థివ‌ లింగం, స్వయంభూ లింగం.


పై 6 శివలింగాలు కాకుండా, స్ప‌టిక‌ శివలింగం, బార్లీ లేదా బియ్యం శివలింగం, భస్మ శివలింగం, బెల్లం శివలింగం, పండు లేదా పువ్వుల శివలింగం, బంగారు-వెండి శివలింగం, మట్టి శివలింగం, పెరుగు శివలింగం, వెల్లుల్లి మొదలైన అనేక రకాల శివలింగాలు ఉన్నాయి.


5. శ్రావణమాసంలో ఏ శివలింగాన్ని పూజించాలి
శ్రావణ మాసంలో, ఒక వ్యక్తి పార్థివ శివలింగాన్ని, స్వయంభూ శివలింగాన్ని, పురాణ లింగాన్ని, పాద‌ర‌స‌ శివలింగాన్ని పూజించాలి. ఇవి అత్యంత ప్రభావవంతమైన స్వీయ-వ్యక్త శివలింగాలు.


Also Read : సోమవారం శివానుగ్రహం పొందాలంటే ఈ ప‌నులు చేయకండి


శ్రావణ మాసంలో పైన పేర్కొన్న శివ లింగాలను పూజించడం ద్వారా, మీరు శివుని అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శ్రావణ మాసంలో శివపూజ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మాసంలో శివలింగానికి చేస‌ పూజ, అభిషేకం ఎంతో మేలు చేస్తుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.