Monday Do's And Don'ts: సోమవారం భోలేనాథ్ అంటే శివునికి అంకితం చేయబడిన రోజు. శంకర భగవానుని సోమవారం శాస్త్ర ప్ర‌కారం న‌మ‌క‌చ‌మ‌కాల‌తో అభిషేకాలు నిర్వ‌హిస్తారు. భక్తులు సోమవారాల్లో ఉపవాసం ఉండి, పవిత్రమైన మనస్సుతో శివుడిని పూజిస్తారు. ప‌ర‌మేశ్వ‌రుడు ముక్కోపిగా పేరొందినా, భ‌క్త సుల‌భుడ‌ని పేరు. ఆయ‌న ప‌సిపిల్లల లాంటి మనస్సు కలిగి ఉండ‌టం వ‌ల్లే భ‌క్తితో చెంబుడు నీళ్లు, ఒక బిల్వ ప‌త్రం స‌మ‌ర్పించినా పొంగిపోతాడు. భ‌క్తితో పూజించే వారిని అనుగ్ర‌హిస్తాడు. ప‌ర‌మ‌ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు అనేక పూజ‌లు చేస్తుంటారు. అయితే, సోమవారం చేయకూడని కొన్ని పనులు ఉన్నాయని గమనించాలి. పొర‌పాటుగానైనా ఆ ప‌నులు చేస్తే శంకరుని అనుగ్రహం లభించదని భ‌క్తుల విశ్వాసం.


Also Read : యోగాకి మాత్రమే కాదు సంగీతం,నాట్యం సహా ప్రతి విద్యకూ పరమేశ్వరుడే ఆద్యుడు!


సోమవారం చేయ‌కూడ‌న‌వి
సోమవారం తెల్లని వస్త్రాలు, పాలు దానం చేయకూడదు. సోమవారం ఉత్తరం, తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ప్రయాణించడం అశుభం. ఈ రోజు ఈ దిశ‌ల్లో ప్రయాణం చేయవలసి వస్తే, వ్యతిరేక దిశలో కొన్ని అడుగులు వేసి, ఆపై ఈ దిశలలో ప్రయాణం ప్రారంభించవచ్చు.


కుల దైవాన్ని పూజించాలి
సోమవారం మీరు మీ కుల‌ దేవతలను పూజించాలి. మీరు కులదేవ‌త‌ను ఆరాధించలేకపోతే, మీరు ఆ దైవాన్ని మీ మనస్సులో స్మ‌రించుకోవాలి. సోమవారం కులదేవతలను పూజించకపోవడం వారిని అవమానించినట్లుగా భావిస్తారు. దీని వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.


ఈ రోజు ఇవి తినవద్దు
సోమవారం రాహు కాలంలో ప్రయాణం మానుకోండి. ఈ స‌మ‌యంలో ఎలాంటి ఆధ్యాత్మిక, శుభ కార్యాలు చేయకండి. శనికి సంబంధించిన ఆహారం, దుస్తులు సోమవారం ధరించాలి. ఈ రోజు బెండకాయలు, ఆవాలు, నల్ల నువ్వులు, మసాలా దినుసులు, ప‌న‌స పండు మొదలైన వాటిని తినవద్దు. అంతే కాకుండా నలుపు, నీలం, గోధుమ, ఊదా రంగుల దుస్తులను ధరించవద్దు.


శివునికి ఇవి సమర్పించకండి
ఈ రోజు శివునికి పసుపు రంగు మిఠాయిలు సమర్పించకూడదు. నల్లపూలు సమర్పించకూడదు. వీటిని శివునికి అర్పించడం చాలా అశుభం. సోమవారం ఎవరితోనైనా వాదించడం మానుకోండి, లేకుంటే మీరు పెద్ద సమస్యలో పడవచ్చు.


Also Read : ఈ భంగిమ‌లో ఉన్న శివుని విగ్రహాలు ఇంట్లో ఉంటే ప‌ర‌మ‌శివుని అనుగ్ర‌హం త‌థ్యం - కానీ అదొక్కటీ వద్దు!


చంద్ర దోషానికి సుల‌భ ప‌రిష్కారం
ఒక వ్యక్తి తన జాతకంలో చంద్ర దోషం ఉండి, అతని జాతకంలో చంద్రుని నుంచి సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అతను సోమవారం రాత్రి తల కింద పాలు లేదా నీటితో నింపిన పాత్రతో నిద్రించాలి. తెల్లవారుజామున నిద్రలేచిన తరువాత, ఈ నీటిని పుష్పించే చెట్టు మొద‌ట్లో పోయాలి. ఇలా చేస్తే చంద్ర దోషం నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.