Secret Behind CM Chandrababu convoy Numbers 393 


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం సమీపం  కేసరపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. జూన్ 12వ తేదీ ఉదయం 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. ఇదే సమయంలో చంద్రబాబు కోసం కొత్త కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలతో చంద్రబాబు కొత్త కాన్వాయ్ సిద్ధం చేశారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్ ఉంది. దశాబ్దాలుగా ఇదే నెంబర్ కొనసాగుతోంది...ఇంతకీ ఈ సంఖ్య   ఎందుకంత సెంటిమెంట్? న్యూమరాలజీ ప్రకారం ఈ నెంబర్ వెనుకున్న ప్రత్యేకత ఏంటి? 


Also Read: Chandrababu Taking The Oath on 12th June: షష్ఠి తిథిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఈ తిథి మంచిదేనా , తారాబలమే ప్రధానమా!


ఏంజెల్ నంబర్ 393


న్యూమరాలజీ ప్రకారం 393 ని ఏంజెల్ నెంబర్ అంటారు. నెంబర్  3 సృజనాత్మకత, స్వీయ-వ్యక్తీకరణ, సానుకూల శక్తిని సూచిస్తుంది. 9.. ఆధ్యాత్మిక మేల్కొలుపుకి ప్రతీకగా చెబుతారు. అందుకే 393ని దేవదూత సంఖ్య అంటారు. అంటే మీ లక్ష్యాలను చేరుకునేందుకు మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నారని , ఇదే విశ్వాసంతో ముందుకు సాగితే మీకు అవసరమైన దైవిక శక్తి లభిస్తుందని.. ఒకవేళ మీ మార్గంలో కష్టం ఎదురైనా దానని అధిగమించేందుకు అవసరం అయిన శక్తి లభిస్తుందని ఈ సంఖ్య వెనుకున్న ఆంతర్యం. ఇదంతా సాధ్యం కావాలంటే ముందు మీలో సానుకూల ఆలోచనలు ఉండాలి...ఏం కోరుకుంటున్నారో ఏ ఏ మంచిపనులు చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా ఉండాలి..దానికి సాధించాలనుకున్న మీ సామర్థ్యాన్ని మీరు విశ్వశించాలి...ఇలాంటప్పుడు స్వయంగా భగవంతుడు మీ ప్రయాణంలో తోడుంటాడని ఈ నెంబర్  ఆంతర్యం. ఇది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదు..ఏ రంగంలో ఉన్నవారు తీసుకున్నా వారికి సదా మంచే జరుగుతుందంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. వ్యక్తిగత అవసరాల కోసం తీసుకుంటే..మీ వైవాహిక బంధం కలకాలం సంతోషంగా ఉంటుందని, బంధాలు వెల్లివిరుస్తాయని, జీవితం సుసంపన్నం అవుతుందని చెబుతారు. మూడో నెంబర్ గురుగ్రహానికి సూచన...గురువు అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని మరో ఆంతర్యం... పైగా 3 తో మొదలై కామన్ పవర్ ఫుల్ నెంబర్ గా చెప్పే 9...ఆ తర్వాత మళ్లీ 3 తో ఎండ్ అవుతోందంటే మరింత లక్కీ అని అంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు...


Also Read: పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం, 26 మందితో మంత్రివర్గం - చంద్రబాబుతోపాటే ప్రమాణం!


చంద్రబాబుకి ఎందుకు ప్రత్యేకం!


ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న నారా చంద్రబాబునాయుడికి న్యూమరాలజీ ప్రకారం లక్కీ నెంబర్ 6.  3 , 9 , 3..మొత్తం 15...ఈ రెండూకలిపితే 6. ముఖ్యంగా వాహనాల విషయంలో లక్కీ నెంబర్ అనుసరించడం ఎంత అవసరం అంటే ఓ ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలిపిరి సంఘటన గురించి ప్రస్తావించారు. ఎప్పుడూ తన లక్కీ  నెంబర్ 6 కలిసొచ్చే 393 వాహనంలో ప్రయాణించే చంద్రబాబు...అలిపిరి ఘటన జరిగిన సమయంలో మాత్రం 4021  నెంబర్ కారులో ఉన్నారు. ప్రమాదం నుంచి తప్పించుకోవడం ఏడుకొండలవాడి ఆశీర్వాదమే అయినప్పటికీ... అప్పుడు కూడా 393 కారులో ప్రయాణించి ఉంటే అసలు ప్రమాదం బారినే పడకుండా ఉండేవారేమో అనే ప్రచారమూ జరిగింది. ఈ సెంటిమెంట్స్ ని ఎవరు ఎంతవరకూ విశ్వశిస్తారన్నది పూర్తిగా వారి వ్యక్తిగతమే అయినా...అభిమానులు కూడా చాలా సందర్భాల్లో ఈ సెంటిమెంట్స్ చూస్తారు. అయితే కేవలం ఈ నెంబర్ చంద్రబాబుకి మాత్రమే కాదు..ఎవరికైనా మంచి ఫలితాలనే ఇస్తుందంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు...


ఆధ్యాత్మిక వేత్తలదీ ఇదే దారి


రాజకీయనాయకులు, సినీ సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలకు మాత్రమే కాదు ఆధ్యాత్మిక వేత్తలకు కూడా ఈ సెంటిమెంట్ ఉంది. మైసూర్ గణపతి సచ్చినాందస్వామి ఆశ్రమానికి ఒకప్పుడు విదేశీయులు ఓ బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారు. ఆ కారు నెంబర్ 9 వచ్చేలా చూసుకున్నారు ఆశ్రమ నిర్వాహకులు. తొమ్మిది సెంటిమెంట్ ఏకంగా ఆశ్రమానిది....ఎంతలా అంటే...నిర్వాహకులు మాత్రమే కాదు అక్కడ పనిచేసే ఉద్యోగుల వాహనాల నెంబర్లు కూడా తొమ్మిది వచ్చేలా ఉంటాయట. మరీ ఇంత అవసరమా అంటే...అదంతా సెంటిమెంట్ మహిమ...


హిందువులకు న్యూమరాలజీ ప్రకారం తొమ్మిది, మూడు సెంటిమెంట్ అయితే..చైనావారికి 8 సెంటిమెంట్..ఈ నెంబర్ కోసం లక్షలు , కోట్లు వెచ్చిస్తారు... అందుకే మరి లక్కీ నంబర్ కోసం అంత పోటీ....