Puneeth Rajkumar Brother Son Yuvaraj Kumar Divorce: దివంగత నటుడు, కన్నడ సూపర్‌ స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ ఇంట విడాకుల వ్యవహరం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన అన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కూమారుడు యువ రాజ్‌కుమార్‌ తన భార్య శ్రీదేవి భైరప్పతో విడిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఈ నెల 6న యువ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అతడు తన భార్యపై తీవ్ర ఆరోపణలు చేశాను. తనను తన భార్య శ్రీదేవి దారుణంగా హింసిస్తుందంటూ, అందువల్లే తనతో విడిపోవాలనుకుంటున్నానంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు.


భర్త ఆరోపణలను శ్రీదేవి తీవ్రంగా ఖండించింది. అంతేకాదు తన భర్త యువ రాజ్‌కుమార్‌కు మరోక మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకి అసలు విషయం ఏంటంటే.. కన్నడ లెజెండరి దివంగత నటుడు రాజ్‌కుమార్‌కు ముగ్గురు కుమారులు అనే విషయం తెలిసిందే. శివ రాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌. ముగ్గురు కూడా నటులే. శివ రాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌లు సూపర్‌ స్టార్‌లుగా కన్నడ నాట ప్రేక్షకుల ఆదరణ పొందారు. రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ పలు చిత్రాల్లో హీరోగా చేసి ఆ తర్వాత నిర్మాత వ్యవహరిస్తున్నారు.


ఆయనకు ఇద్దరు కుమారులు కాగా రెండవ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ ఇటివలె హీరోగా కన్నడ ఇండస్ట్రీలో ఆరంగేట్రం చేశాడు. అంతలోనే అతడు విడాకుల వ్యవహరంతో వార్తల్లో నిలవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా తన భార్య తనని హింసిస్తుందంటూ యువ రాజ్‌కుమార్‌ వేసిన విడాకుల జూన్‌ 6న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశాడు. అంతేకాదు తన భార్య మరొకరితో అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. భర్త ఆరోపణలపై స్పందించిన శ్రీదేవి భైరప్పు కూడా యువ రాజ్‌కుమార్‌కు కౌంటర్‌ ఇచ్చింది. తన భర్తకు నటితో అక్రమ సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో యువ రాజ్‌కుమార్‌ తరపు న్యాయవాది మీడియా సమావేశం నిర్వహించి శ్రీదేవి భైరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు.  


లాయర్‌ సంచలన కామెంట్స్‌


విలేకరుల సమావేశంలో యువ రాజ్‌కుమార్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. "శ్రీదేవి తన భర్త పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఆమె పెళ్లయిన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన అక్రమ సంబంధాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువ రాజ్‌కుమార్‌కు ఓ నటితో సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తుంది. యువ రాజ్‌కుమార్‌కు లైంగిక సమస్యలు ఉన్నాయంటూ శ్రీదేవి నేను పంపిన లీగల్‌ నోటీసులకు సమాధానం ఇచ్చింది. మరి ఆ విధమైన సమస్యలు ఉన్న వ్యక్తికి మరోకరి అక్రమ సంబంధం ఎలా సాధ్యమవుతుంది. ఇదంతా శ్రీదేవి కావాలనే చేస్తుంది. యువ రాజ్‌కుమార్‌ ఇంటి పేరు దుర్వినియోగం చేయాలనే క్షక్ష్యతోనే ఆమె ఇలాంటి తప్పుడు కథనాన్ని సృష్టిస్తుంది" అని ఆయన ఆరోపించారు.   


శ్రీదేవి బైరప్ప ఆవేదన


లాయర్‌ కామెంట్స్‌పై యువ రాజ్ కుమార్ భార్య శ్రీదేవి భైరప్ప సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. చట్టాన్ని, వృత్తిపరమైన సమగ్రతను కాపాడాల్సిన వ్యక్తే ఓ మహిళ క్యారెక్టర్‌ని తక్కువ చేసి బహిరంగంగా తప్పుడు ఆరోపణలు చేయడం బాధకరమైన విషయం. గత కొంతకాలంగా నేను ఎన్నో బాధలు పడ్డాను. యువ రాజ్‌కుమార్‌కు ఒక నటితో అక్రమ ఉంది. కానీ కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ఇంతకాలం నేను మాట్లాడకుండ మౌనంగా ఉన్నాను. కానీ నా వ్యక్తిత్వాన్ని, మానత్వాన్ని అగౌరపరిచే విధంగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పటికైన నిజం, న్యాయం గెలుస్తుందని నమ్ముతున్నాను" అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్ చేసింది.






దీంతో ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక భార్యభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేసుకోవడం చూసి అంతా షాక్‌ అవుతున్నారు. మరి మున్ముందు వారిద్దరి మధ్య వాగ్వాదం ఎక్కడికి దారి చూస్తుందే చూడాలి. ఇక వీరి విడాకుల పిటిషన్‌పై జూలై 4న విచారణ జరగనుంది. కాగా ఓమ్‌ సినిమాతో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేసిన యువ రాజ్‌కుమార్‌, ఈ ఏడాది 'యువ' సినిమాతో హీరో పరిచయం అయ్యాడు. ఇక నాలుగేళ్ల కిందట మైసూరుకు చెందిన శ్రీదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మొదట వీరి ప్రేమను కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట. అయితే పునీత్ రాజ్‌కుమార్‌ జోక్యంతో వీరిద్దరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది.


Also Read: మహేష్ బాబులా ఉన్నావని అంటే నా కొడుక్కి కోపం వచ్చేస్తుంది - హీరో సుధీర్ బాబు