Rajinikanth’s Vettaiyan  seals its OTT deal Before Release: సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఈయ‌న సినిమా అనౌన్స్ చేస్తే చాలు ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతుంటారు. ఆ సినిమాకి ఉండే క్రేజ్ వేరే చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి ఆ సినిమాలో బాలీవుడ్ న‌టులు, టాలీవుడ్ కి చెందిన ప్రముఖ న‌టులు ఉంటే ఆ సినిమా వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాపై ఊహాగానాలు పెరిగిపోతాయి. ప్రీ బిజినెస్ జ‌రిగిపోతుంది. 'వేట్ట‌యాన్' సినిమా విష‌యంలో కూడా అదే జరిగింది. రిలీజ్‌కు ముందే సినిమాని లాక్ చేసుకుందట ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌. 


ఏ ఓటీటీ అంటే.. 


సూర్య 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వ‌హిస్తున్న సినిమా 'వేట్ట‌యాన్'. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఉన్నారు. సినిమాకి సంబంధించి షూటింగ్ ఇప్ప‌టికే దాదాపు పూర్తి అయ్యింది. ద‌స‌రాకి సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. అయితే, ఈ సినిమా రిలీజ్ కి ముందే.. రికార్డులు సృష్టిస్తోంది. సినిమాని ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంద‌ట‌. మంచి ఫ్యాన్సీ ధ‌ర‌కే ద‌క్కించుకుంది అని టాక్ గ‌ట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా అద్భుతంగా ఉంబోతోంద‌ని, ర‌జ‌నీకాంత్ ఫ్యాన్స్ కి ఏం కావాలో అన్ని దీంట్లో ఉంటాయ‌ని డైరెక్ట‌ర్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. దీంతో ఈ సినిమా కోసం పోటీ ప‌డింద‌ట అమెజాన్. అంతేకాకుండా.. భారీ సక్సెస్ సాధించిన 'జైలర్' తర్వాత రజనీకాంత్ నటిస్తున్న సినిమా 'వేట్టయాన్'. దీంతో ఫ్యాన్స్ లో ఈసినిమాపై చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్, ర‌జ‌నీకాంత్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. 


భారీ కాస్ట్.. 


'వేట్టియాన్' సినిమాలో ర‌జ‌నీకాంత్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఆయ‌న‌తో పాటు ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్, ఫాహ‌ద్ ఫైసిల్, రానా ద‌గ్గుబాటి, మంజు వారియ‌ర్, విజ‌యన్, రితికా సింగ్, జీఎమ్ సుంద‌ర్, రోహిని, రావు ర‌మేశ్ త‌దిత‌రులు యాక్ట్ చేస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో సుభ‌క‌ర‌ణ్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగు, త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లో కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే సినిమా టీమ్ ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 10న సినిమా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. దాంతో దసరా బరిలో 'దేవర' వర్సెస్ 'వేట్టయాన్' కాంపిటీషన్ ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు సినీ విశ్లేష‌కులు. 


ఓటీటీల‌కు పెరిగిన క్రేజ్.. 


క‌రోనా, లాక్ డౌన్ త‌ర్వాత ఓటీటీల‌కి క్రేజ్ బాగా పెరిగింది. చాలా కొద్ది మంది మాత్ర‌మే థియేట‌ర్ల‌కు వెళ్లి మ‌రీ సినిమాలు చూస్తున్నారు. 70 శాతం మంది ఓటీటీల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఓటీటీ సంస్థ‌లు. సినిమాకి హైప్ క్రియేట్ అయితే చాలు, పెద్ద హీరో ఉంటే చాలు రిలీజ్ కి ముందే డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. 


Also Read: మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా, మీరేం చేస్తారో చేసుకోండి - అల్లు అర్జున్‌కు కిరాక్ ఆర్పీ ఛాలెంజ్