Sawan Rashifal Nag Panchami 2024 Horoscope: ఆగష్టు 09 నాగపంచమి రోజు చాలా శుభయోగాలు ఏర్పడుతున్నాయి. దీనితో పాటూ ఈ రోజు ముఖ్యమైన గ్రహాల కలయిక కూడా ఉండబోతోంది. జాతకంలో యోగాన్నిచ్చే ముఖ్యగ్రహాలైన శని, బుధుడు, శుక్రుడు, బృహస్పతి కలయిక వల్ల కొన్ని రాశులవారికి ఊహించని శుభయోగాలున్నాయి. విలాసవంతమైన జీవితాన్నిచ్చే శుక్రుడు - గ్రహాల రాకుమారుడైన బుధుడు.. సింహరాశిలో ఉండడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. రాహువు మీన రాశిలో, కేతువు కన్యా రాశిలో సంచరించడం కూడా కొన్ని రాశులవారికి అదృష్టాన్ని మోసుకొస్తోంది. నాగపంచమి రోజు  సిద్ధయోగం, రవియోగంతో పాటూ ఆ రోజంతా హస్తా, చిత్త నశ్రక్షాలున్నాయి. ఈ సందర్భంగా నాగపంచమి రోజు కొన్ని రాశులవారిపై కనకవర్షమే. మీ రాశి ఇందులో ఉందా...


Also Read: ఆగష్టు 09 నాగపంచమి రోజు పుట్టలో పాలుపోసే ముహూర్తం - చదువుకోవాల్సిన శ్లోకాలివే!


మేష రాశి (Aries)


నాగ పంచమి రోజున శుభ యోగాన్నిస్తున్న సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు , అంగారకుడు మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆస్తులు, భూములు, వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారి కల ఫలిస్తుంది. వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న సమస్యలున్నా వాటిని సులువుగా అధిగమిస్తారు. ఊహించని మూలల నుంచి డబ్బు వచ్చి చేరుతుంది.  


వృషభ రాశి (Taurus)


వృషభ రాశివారికి కూడా  శని, శుక్ర, గురు, అంగారకుడు, బుధుడు, సూర్య గ్రహాల సంచారం శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో చేపట్టిన పనులను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్నేహితులు, సన్నిహితుల నుంచి సహకారం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేసుకుంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. 


Also Read: ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!


సింహ రాశి (Leo)


నాగపంచమి రోజు సింహరాశిలో లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఈ రాశివారికి రాజభోగమే.నిన్న మొన్నటి వరకూ వెంటాడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఉద్యోగులు పదోన్నతకి సంబంధించిన సమాచారం వింటారు. కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగాలలో స్థిరపడతారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!