Naag Panchami 2024  Date Time and Shubh Muhurat 

పంచమి తిథి ఆగష్టు 09 శుక్రవారం సూర్యోదయం నుంచి రాత్రి 11 గంటల 49 నిముషాల వరకూ ఉంది

అమృత ఘడియలు - సాయంత్రం  6 గంటల 7 నిముషాల నుంచి 7 గంటల 53 నిముషాల వరకు

వర్జ్యం - శుక్రవారం ఉదయం  7 గంటల 26 నుంచి  9 గంటల 12 నిముషాల వరకు

దుర్ముహూర్తం - శుక్రవారం ఉదయం 8 గంటల 16 నిముషాల నుంచి 9 గంటల 7 నిముషాల వరకు తిరిగి.. మధ్యాహ్నం 12 గంటల 31 నిముషాల నుంచి ఒంటిగంటన్నవరకూ ఉంది

పుట్టలో పాలుపోసేందుకు శుభముహూర్తం అంటే... వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం మొత్తం పుట్టలో పాలు పోసేందుకు, నాగేంద్రుడి పూజకు శుభమూర్తమే. శుక్రవారం ఉదయం 7 గంటల లోపు కానీ... 9 గంటల 15 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ ఎప్పుడైనా నాగేంద్రుడి పూజ చేసుకోవచ్చు.

నాగులచవితికి పుట్టలో పాలుపోసేందుకు బయలుదేరేముందు ముందుగా ఇంట్లో దేవుడి మందిరంలో దీపం వెలిగించి నమస్కరించాలి. పుట్టదగ్గరకు తీసుకెళ్లేందుకు చేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు , పండ్లు...కొన్ని విడిగాతీసి ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పుట్టదగ్గరకు వెళ్లాలి.  పుట్ట దగ్గర ప్రత్యేక పూజలు అవసరం లేదుకానీ..నవగాన స్త్రోత్రం, సర్ప సూక్తం చదువుకున్నా మంచిదే. పుట్టదగ్గర రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అంత సమయం అక్కడ ఉండదు అనుకున్నప్పుడు ఇంట్లో అయినా చదువుకుని వెళ్లొచ్చు. 

నవనాగ నామ స్తోత్రం

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!

ఫలశృతి

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!

సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!

ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి

Also Read: ఏటా శ్రావణమాసంలో నాగపంచమి ఒక్క రోజు మాత్రమే తెరిచే ఆలయం ఇది!

సర్ప ప్రార్థన

బ్రహ్మ లోకేచ సర్పః శేషనాగ పురోగమః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

విష్ణు లోకే చ యేసర్పః వాసుకి ప్రముకాస్చయే:
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

రుద్రలోకే చ యేసర్పః తక్షక ప్రముఖాస్థధా |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

ఖాండవస్య తథాదాహే స్వర్గం యే చ సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

సర్పసత్రేయే సర్పాః ఆస్తికేన చరక్షితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

ప్రళయే చైవ యే సర్పః కర్కోట ప్రముఖాశ్యయే |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

ధర్మలోకేచయే సర్పాః వైతరన్యాం సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

యేసర్పః పార్వతాయేషు దరీసంధిషు సంస్థతాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

గ్రామేవాయది వారన్యే సర్పః ప్రచరంతిహి
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 

పృథివ్యాం చైవ యేసర్పాయే సర్ప బిలసంస్తితా
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

రసాతలే చయే సర్పా అనంతాధ్యామహాబలాః
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా ||  

ఇతి శ్రీ సర్ప ప్రార్థన సంపూర్ణం ||

Also Read: పుట్టలో పాలు పోసేది పాముల కోసం కాదా? పుట్ట మన్ను చెవులకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా!