Saturn in Pisces 2025: శని దేవుడు న్యాయం, కర్మ ప్రధాత అని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. మనం ఆచరించే కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దాదాపు 30 సంవత్సరాల తర్వాత గురువు రాశి అయిన మీనంలోకి ప్రవేశించాడు. 2027 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. జూలై నెలలో మీన రాశిలో వక్రంలోకి మారిన శని ప్రస్తుతం ఇదే స్థితిలో కొనసాగుతున్నాడు. నవంబర్ నెలలో మళ్లీ వక్రం నుంచి సాధారణ స్థితికి వస్తాడు. తిరోగమన దశ నుంచి శని సాధారణ దశకు మారడం వల్ల కొన్ని రాశులవారిపై శుభ ప్రభావం ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. అదృష్టం కలిసొచ్చే ఆ రాశులేంటో తెలుసుకుందాం..
శని తిరోగనం నుంచి సాధారణ దశకు వచ్చిన తర్వాత మూడు రాశులవారికి శుభ ఫలిలతాలుంటాయి
వైదిక పంచాంగం ప్రకారం, శని నవంబర్ ఆఖరి వారంలో మీన రాశిలో తిరోగమనం నుంచి సాధారణ స్థితికి వస్తాడు
మిథున రాశి (Gemini Horoscope)
మీన రాశిలో శని సాధారణ స్థితిలో సంచరించడం మిథున రాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని ప్రత్యక్ష కదలిక కారణంగా, ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ధన లాభం కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకు శుభ ఫలితాలుంటాయి. మీ పనిని కార్యాలయంలో ప్రశంసిస్తారు. ఈ సమయంలో ఇంటిలో లేదా బయట ఏదైనా కొత్త బాధ్యతలు పొందవచ్చు. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. మునుపటి పెట్టుబడుల నుంచి మంచి రాబడి లభిస్తుంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.
కుంభ రాశి (Aquarius Horoscope)
శని తిరోగమనం నుంచి సాధారణ స్థితికి చేరిన తర్వాత ఆ ప్రభావం కుంభ రాశివారిపై సానుకూలంగా ఉంటుంది . శని దేవుడు స్వయంగా కుంభ రాశికి అధిపతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడు రెండవ ఇంట్లో సంచరిస్తున్నట్టు. పైగా ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది మీకు. ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. వాయిస్, కమ్యూనికేషన్ లేదా మార్కెటింగ్ రంగంలో కెరీర్ ఉన్న కుంభ రాశి వారికి ఇది చాలా ముఖ్యమైన సమయం. ఉద్యోగులకు ఆఫీసులో పదోన్నతి లభించడంతో పాటు పని రంగంలో కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయాల్లో ఉండేవారికి ప్రజాదరణ పెరుగుతుంది.
వృషభ రాశి (Tauru Horoscope)
శని సాధారణ సంచారం వృషభ రాశి వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది. శని దేవుడు ఈ రాశిలో 11వ ఇంట్లో ఉన్నాడు. 11వ ఇల్లు ఆదాయం , ధన లాభానికి సంబంధించినది. శని ప్రత్యక్ష కదలికతో మీ ఆదాయం పెరుగుతుంది .. ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన డీల్స్ కూడా లభిస్తాయి. ఈ సమయం మీకు డబ్బు సంపాదించడానికి మాత్రమే కాకుండా డబ్బును ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది.
శని అనుగ్రహం కోసం ఇవి అనుసరించండి
శని శ్లోకాలు జపించడంతో పాటూ శనివారం నాడు రావి చెట్టు కింద దీపం వెలిగించి ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని జపించాలి.
శని దేవుడి విగ్రహానికి నువ్వులు లేదా ఆవాల నూనెను సమర్పించాలి. ఆవాల నూనె శని దేవునికి ప్రీతికరమైనది.
ఈ సమయంలో పేదలకు నల్ల బట్టలు, నల్ల నువ్వులు, మినపప్పు, ఆవాల నూనె , ఇనుప వస్తువులను దానం చేయాలి.
శని దోషం లేదా బాధ నుంచి బయటపడటానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇది సర్వకార్యాలను నెరవేరుస్తుంది.
శని దేవుని వాహనం కాకి, ఈ సమయంలో కాకికి ఆహారం వేయాలి
శని దేవుడు న్యాయం ప్రియుడు, అతను కష్టతరమైన పరిస్థితుల ద్వారా ప్రజలను సరైన మార్గంలోకి తీసుకువస్తాడు. శని మార్గి సమయంలో క్రమశిక్షణ పాటించాలి.
గమనిక: గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.