2025  సెప్టెంబర్ 09 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu September 09th 2025 

Continues below advertisement

మేష రాశి

ఈ రోజు సాధారణ రోజు, మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది.కెరీర్/ధనం: ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది.కుటుంబ జీవితం: సంతానం నుంచి శుభవార్త అందుతుంది, కుటుంబంలో ఐక్యత ఉంటుంది.ఆరోగ్యం: ఒత్తిడి కారణంగా అలసట ఉండవచ్చు, సహనం పాటించండి.పరిహారం: హనుమంతునికి బెల్లం  సమర్పించండి.

Continues below advertisement

వృషభ రాశి

ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది, కానీ మాటలపై నియంత్రణ అవసరం.కెరీర్/ధనం: ఆదాయం పెరిగే సూచనలు, అనవసర ఖర్చులను నివారించండి.కుటుంబ జీవితం: జీవిత భాగస్వామి సహకారం అందుతుంది, పాత స్నేహితుడిని కలుసుకోవచ్చు.ఆరోగ్యం: తలనొప్పి లేదా అలసట వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ నీరు త్రాగండి.పరిహారం: లక్ష్మీ నారాయణుడిని ధ్యానించండి.

మిథున రాశి

ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.కెరీర్/ధనం: పనిలో రిస్క్ తీసుకోకండి, కొత్త బాధ్యతలను పొందుతారుకుటుంబ జీవితం: కుటుంబానికి సంబంధించిన ఆందోళన ఉంటుంది, పాత తప్పు బయటపడవచ్చు.ఆరోగ్యం: మానసిక ఒత్తిడి వల్ల అలసట వచ్చే అవకాశం ఉంది.పరిహారం: తులసికి నీరు సమర్పించండి.

కర్కాటక రాశి

బిజీగా ఉండే రోజు, పనులను వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు.కెరీర్/ధనం: ఆగిపోయిన పనులు తండ్రి సహాయంతో  పూర్తవుతాయి, ఆస్తి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కుటుంబ జీవితం: తల్లిదండ్రుల ఆశీర్వాదం లభిస్తుంది, ప్రతిష్ట పెరుగుతుంది.ఆరోగ్యం: అలసట ఉండవచ్చు, విశ్రాంతి అవసరం.పరిహారం: శివలింగానికి నీటితో అభిషేకం చేయండి సింహ రాశి

ఈ రోజు ఆందోళన ఉంటుంది, తొందరపాటు వద్దుకెరీర్/ధనం: వ్యాపారంలో లాభం ఉంటుంది, పని సామర్థ్యం మెరుగుపడుతుంది.కుటుంబ జీవితం: కుటుంబంలో  మద్దతు లభిస్తుంది ఆరోగ్యం: మానసిక అశాంతి ఉండవచ్చు.పరిహారం: సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి.

కన్యా రాశి 

ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది.కెరీర్/ధనం: కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థిక లాభం, మీపై మీరు నమ్మకం ఉంచుకోండి.కుటుంబ జీవితం: పిల్లలతో మంచి సమయం గడుపుతారు.ఆరోగ్యం: ఆహారంలో నియంత్రణ పాటించండి.పరిహారం: ఆకుపచ్చ పండ్లను దానం చేయండి.

తులా రాశి 

ఈ రోజు అనుకూలమైన రోజు, అదృష్టం కలిసి వస్తుంది.కెరీర్/ధనం: ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికందుతుందికుటుంబ జీవితం: వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది.ఆరోగ్యం: యోగాతో ప్రయోజనం ఉంటుంది.పరిహారం: సరస్వతి దేవిని పూజించండి.

వృశ్చిక రాశి 

ఈ రోజు పనుల్లో బిజీగా ఉంటారు.కెరీర్/ధనం: పనికి ప్రశంసలు లభిస్తాయి, రాజకీయ నాయకులతో చర్చిస్తారుకుటుంబ జీవితం: కుటుంబ సంబంధాలు బలపడతాయి.ఆరోగ్యం: మానసిక, శారీరక శక్తి ఉంటుంది.పరిహారం: ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి.

ధనుస్సు రాశి 

ఈ రోజు ఆనందంతో కూడిన రోజు.కెరీర్/ధనం: పదోన్నతి లేదా ఆగిపోయిన ధనం పొందే అవకాశం ఉంది.కుటుంబ జీవితం: పిల్లల విజయాల వల్ల ఇంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది.ఆరోగ్యం: టెన్షన్ తగ్గుతుంది, మనస్సు సంతోషంగా ఉంటుంది.పరిహారం: రావి చెట్టు కింద దీపం వెలిగించండి.

మకర రాశి  

ఈ రోజు శుభవార్తలతో నిండి ఉంటుంది.కెరీర్/ధనం: ధన లాభం , సామాజిక గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి.కుటుంబ జీవితం: సంతాన సౌఖ్యం పొందే అవకాశం ఉంది.ఆరోగ్యం: ఆరోగ్యం మెరుగుపడుతుంది.పరిహారం: శనిదేవుని ఆలయంలో ఆవాల నూనెను సమర్పించండి.

కుంభ రాశి 

ఈ రోజు బాగుంటుంది, నియంత్రిత ప్రవర్తన అవసరం.కెరీర్/ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ జీవితం: సంతానం నుంచి సంతోషం... స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది.ఆరోగ్యం: పొట్ట సంబంధిత సమస్యలు ఉండవచ్చు, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి.పరిహారం: నీలం రంగు దుస్తులు ధరించండి  , శనిదేవునికి నువ్వులు సమర్పించండి.

మీన రాశి 

ఈ రోజు సాధారణ రోజు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.కెరీర్/ధనం: పథకాలు విజయవంతం అవుతాయికుటుంబ జీవితం: కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయిఆరోగ్యం: అధికంగా ఆలోచించవద్దుపరిహారం: అరటి చెట్టును పూజించండి.

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.